• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ చరణ్ విలన్ గా ఆ...

రామ్ చరణ్ విలన్ గా ఆ బాలీవుడ్ నటుడు?

By - Tupaki Desk
Update: 2017-12-17 05:55 GMT
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రీకరణ పూర్తి కావస్తోంది. ఈ చిత్ర చివరి షెడ్యూల్ జనవరి మధ్యకల్లా పూర్తవుతుందని అంటున్నారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రామ్ చరణ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జనవరి నెలాఖర్లో లేదా ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు చివరి దశలో ఉండగా.. నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ నటుడు విలన్ పాత్ర పోషిస్తాడని సమాచారం. ఆ నటుడు మరెవరో కాదు.. ‘రక్తచరిత్ర’లో పరిటాల రవి పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన వివేక్ ఒబెరాయ్.

‘రక్తచరిత్ర’ తర్వాత తెలుగుతో రెండు మూడు మంచి అవకాశాలు వచ్చినా వివేక్ నటించలేదు. ‘ఖైదీ నంబర్ 150’లో అతనే విలన్ అన్నారు. కానీ అది నిజం కాలేదు. అతను ఈ మధ్యే తమిళంలో అజిత్ సినిమా ‘వివేగం’లో విలన్ పాత్ర పోషించాడు. విలన్ పాత్రల్ని చాలా వయొలెంట్ గా చూపిస్తాడు బోయపాటి. మరి వివేక్ ఎలా కనిపిస్తాడో చూడాలి. ఈ చిత్రంలో శివగామి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ ల సరసన నటించిన అను ఇమ్మాన్యుయెల్ ఇందులో హీరోయిన్ పాత్ర పోషిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నాడు. ఈ సినిమా ముగించాక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీస్టారర్ చేయబోతున్నాడు చరణ్.
Tags:    
  • Vivek Oberoi 
  • Ram CHaran 
  • Boyapati Srinu 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS