• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ లుక్: 'ఓరి దేవుడా'...

ఫస్ట్ లుక్: 'ఓరి దేవుడా' అంటున్న విశ్వక్ సేన్..!

By - Tupaki Desk
Update: 2021-11-09 10:40 GMT
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల 'పాగల్' మూవీతో అలరించిన విశ్వక్.. ప్రస్తుతం ఐదు కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అందులో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి “ఓరి దేవుడా” అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని వెల్లడించిన మేకర్స్ ఈరోజు మంగళవారం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు.

'ఓరి దేవుడా' చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇద్దరు వధూవరులుగా ముస్తాభై ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు మాస్ రోల్స్ లో అలరించిన మాస్ కా దాస్.. ఇప్పుడు దానికి భిన్నంగా సాఫ్ట్ గా కనిపిస్తున్నారు. మోషన్ పోస్టర్ లో విశ్వక్ దేని కోసమో ఎగురుతూ ఉండగా.. వెనుక నుంచి మిథిలా తాడుతో అతన్ని లాగుతున్నట్లు చూపించారు. ఈ కూల్ అండ్ లవ్లీ పోస్టర్ ప్రేక్షకులను అలరిస్తోంది.

''ఓరి దేవుడా'' సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'ఓ మై కడవులే' చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో అశోక్ సెల్వన్ - రితికా సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అక్కడ ఘన విజయం సాధించింది. మాతృకను డైరెక్ట్ చేసిన అశ్వత్ తెలుగు వెర్షన్ కూ దర్శకత్వం వహిస్తున్నారు. పీవీపీ సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. పెర్ల్ వి పొట్లూరి - పరమ్ వి పొట్లూరి - దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

''ఓరి దేవుడా'' విశ్వక్ సేన్ కెరీర్ లో 6వ సినిమా. 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు. విధు అయ్యన సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇకపోతే తమిళ్ లో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి పోషించిన గెస్ట్ రోల్ తెలుగులో ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.


Full View
Tags:    
  • Vishwak Sen 
  • Ori Devuda 
  • Motion Poster 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS