ఏపీ ప్రభుత్వ ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానానికి హ్యాట్సాఫ్ చెప్పిన స్టార్ హీరో..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ సేవల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మల్టీప్లెక్స్ లతో సహా అన్ని థియేటర్లలో ప్రభుత్వ పోర్టల్ ద్వారానే సినిమా టిక్కెట్లు విక్రయించాలని ప్రతిపాదిస్తూ బుధవారం ఓ జీవో జారీ చేశారు. రైల్వే ఆన్ లైన్ టిక్కెటింగ్ సిస్టమ్ ఇష్యూ చేస్తున్న ఐ.ఆర్.సి.టి.సి. తరహాలో ఈ పోర్టల్ సేవలు అందిస్తుందని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్రం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ సర్వీస్ నడుస్తుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
ఈ ప్రతిపాదనపై టాలీవుడ్ పెద్దలు ఇంకా స్పందించలేదు. డైరెక్టర్ దేవకట్టా మాత్రం సోషల్ మీడియా వేదికగా పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో విశాల్ ఏపీ ప్రభుత్వ నిర్ణయం పై స్పందించారు. ప్రభుత్వ ఆన్ లైన్ సినిమా టికెటింగ్ పోర్టల్ విధానాన్ని స్వాగతించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా దీనిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ విశాల్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.
''థాంక్యూ!! ఏపీలో థియేటర్లలో ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ ను అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి హ్యాట్సాఫ్. తమిళనాడులో కూడా మేము ఎప్పటి నుంచో దీనిని అమలు చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇది జరగడం సంతోషంగా ఉంది. ఇది 100% పారదర్శకతను తెస్తుంది కనుక ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ దీన్ని స్వాగతించాలి. తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ రంగాలకు గొప్ప ఊరట కలిగించే థియేటర్ కలెక్షన్లలో పూర్తి పారదర్శకతను తీసుకురావడానికి ఇదే విధానాన్ని అమలు చేయాలని మన ముఖ్యమంత్రి తిరు MK స్టాలిన్ సర్ ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను'' అని విశాల్ లేఖలో పేర్కొన్నారు.
తెలుగువాడైన విశాల్ సమర్ధించినట్లే ఆన్ లైన్ సినిమా టికెటింగ్ సిస్టమ్ ని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ (టీఎఫ్పీసీఏపీ) అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా స్వాగతించారు. సినిమా టికెట్స్ ఆన్లైన్ లో విక్రయించాలనుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చరిత్రాత్మకమని.. ఇది టిక్కెట్ల దోపిడీని అరికడుతుందని అన్నారు. దీని వల్ల ప్రేక్షకులకు వినోదం భారం తగ్గుతుందని.. నిర్మాతలు ఖర్చులు తగ్గించుకొని, సినిమా బడ్జెట్ అదుపులో ఉంచడానికి దోహదపడుతుందని జగదీశ్వర్ తెలిపారు. సినీ కార్మికులకు, చిన్న నిర్మాతలకు మేలు జరిగుతుందని.. కానీ వ్యక్తిగత లాభాలకు గండి పడుతుందని కొంత మంది నిర్మాతలు ఆ ఆలోచనను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.