హిట్ కోసం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు వ‌లే దండయాత్ర చేస్తున్నాడుగా..!

Update: 2021-01-05 02:30 GMT
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో విజయ్‌ ఆంటోనీ విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యాడు. 'నకిలీ' 'డా.సలీమ్‌' చిత్రాలతో ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ.. 'బిచ్చగాడు' సినిమాతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. ఎటుంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో పాటు విజయ్ ఆంటోనికి తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో అప్పటినుంచి తాను నటించే ప్రతి సినిమాని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. అయితే 'బిచ్చగాడు' తర్వాత ఆ స్థాయిలో విజయ్ ఆంటోనీకి మరో సక్సెస్ అందలేదు.

'బిచ్చగాడు' తర్వాత విజయ్ ఆంటోనీ.. 'భేతాళుడు' 'ఇంద్రసేన' 'రోషగాడు' కిల్లర్‌' వంటి చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఇవన్నీ డిఫరెంట్ సినిమాలు అనిపించుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు నమోదు చేయలేకపోయాయి. దీంతో ఇప్పుడు తెలుగులో విజ‌య్ ఆంటోని మార్కెట్ దాదాపుగా జీరో అయిపోంద‌నే కామెంట్స్ వస్తున్నాయి. అయినా సరే మ‌రో హిట్ కోసం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు వ‌లే ఆంటోనీ టాలీవుడ్ మీద దండెత్తి వ‌స్తూనే ఉన్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. విజయ్ నటించిన తాజా చిత్రం ‘విజయ రాఘవన్‌’ టీజర్ ఇటీవలే విడుదలైంది. ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో ఈ సినిమాను టి.డి. రాజా - డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. అలానే 'బిచ్చగాడు' సినిమాకి కొనసాగింపుగా 'బిచ్చగాడు 2' చేస్తున్నాడు. విజయ్ ఆంటోనీ హోమ్ ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఈ టాలెంటెడ్ యాక్టర్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య తెలుగులో ట్వీట్స్ పెడుతూ ఇక్కడి ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోనీ.. త్వరలో సూపర్ అందుకుంటాడేమో చూడాలి.
Tags:    

Similar News