తప్పకుండా అతనికి ఆస్కార్ వస్తుంది

Update: 2017-08-21 10:47 GMT
అభిమానం టూ ది పీక్స్ అంటే ఇప్పుడు తమిళనాడులోని ఒక పంపిణీదారుడు అయిన అభిరామి రామనాథన్ దే అనే చెప్పాలి. ఈయన ఇప్పుడు హీరో విజయ్ కు వీరాభిమాని. ఈయనగారు మొన్న మెర్సల్ ఆడియో రిలీజ్ నాడు చేసిన కామెంట్లు ఇప్పుడు తమిళనాటు పిచ్చ కామెడీకి తెరలేపాయ్. అదేంటో తెలుసుకుంటే మీకూ అలాగే ఉంటుంది కాని.. ఇందులో కామెడీకంటే ప్రేమనే వెతుక్కోవాలి.

నిజానికి ఒకప్పుడు తన సినిమాను రిలీజ్ చేయమని హీరో విజయ్ ఇతన్ని ధియేటర్లు అడిగేవాడట. కాని ఇప్పుడు పాతికేళ్ళ తరువాత తనలాంటి పంపిణీదారులే నీ సినిమా మాకు ఇవ్వవ్వయ్యా ప్లీజ్ అంటూ అతని వెనుకపడుతున్నారట. ఆఫ్‌ కోర్స్.. అది నిజమేలే. ఏ స్టార్ హీరోకైనా ఇదే తరహాలో జరుగుతుంది. అయితే ఇదే తరహాలో మాట్లాడుతూ.. రామనాథన్ ఏమన్నాడంటే.. ఎప్పటికైనా విజయ్ కు ఆస్కార్ అవార్డ్ వస్తుంది అన్నాడు. దానితో ఇప్పుడు తమిళనాట 'అసలు తమిళ సినిమాల్లో చేసే హీరోకు హాలీవుడ్ లో ఎందుకు ఆస్కార్ ఇస్తారు?' అంటూ కామెంట్లు కామెడీలు చేస్తున్నారు.

నిజానికి బెస్ట్ యాక్టర్ లేదా సపోర్టింగ్ యాక్టర్ తాలూకు ఆస్కార్ అవార్డ్.. ఏ ప్రాంతపు నటుడికైనా ఏ దేశపు నటికైనా వరిస్తుంది.. కాని వారు హాలీవుడ్ లో తీయబడిన ఇంగ్లీషు సినిమాలో నటిస్తేనే ఆ పోటీకి అర్హులు. కాబ్టటి విజయ్ ఎప్పటికైనా హాలీవుడ్ లో కూడా నటిస్తే.. అక్కడ అతనికి ఆస్కార్ వచ్చే ఛాన్సుంటుంది. ఇలా ఆలోచించాలే తప్పించి.. విజయ్ కు ఆస్కార్ అనగానే కామెడీలు ఎందుకులే సామి!!
Tags:    

Similar News