• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాస్టర్​ ఓటీటీలోనా..?...

మాస్టర్​ ఓటీటీలోనా..? అస్సలు వద్దంటున్న విజయ్​ ఫ్యాన్స్​..

By - Tupaki Desk
Update: 2020-11-28 13:48 GMT
ఇళయదళపతి విజయ్​ నటించిన ‘మాస్టర్​’ సినిమాపై వస్తున్న ఓ తాజా అప్​డేట్​తో ఫ్యాన్స్​ తీవ్ర ఆందోళనలో ఉన్నారట. నిజానికి మాస్టర్​ చిత్రం గత వేసవిలోనే రిలీజ్​ కావల్సింది. కానీ కరోనా లాక్​డౌన్​తో ఆగిపోయింది. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్​ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే లాక్​డౌన్​ నిబంధనలు ఒక్కోటీ సడలిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకొనేందుకు కూడా అనుమతులు వచ్చాయి. దీంతో మాస్టర్​ సినిమా దీపావళికి వచ్చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. కానీ అదంతా పుకారే అని తేలిపోయింది.

మాస్టర్​ లాంటి భారీ బడ్జెట్​ సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్​ చేస్తే ఆశించిన లాభాలు రావు. సినిమా హిట్​ అయితే అంతో ఇంతో వస్తాయి. కానీ పొరపాటున బ్యాడ్​ టాక్​ వచ్చిందంటే నిర్మాత ఎంతో నష్టపోతాడు. కాబట్టి సమయం చూసి రిలీజ్​ చేస్తారు. ఒక వేళ డివైడ్​ టాక్​ వచ్చినా కొంతమేర లాభాలైనా వస్తాయి. వివిధ కారణాలతో సినిమా దీపావళికి రాలేదు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్​ బయటకొచ్చింది. ఇందులోని సన్నివేశాలు మాస్​ ఆడియన్స్​ను తెగ ఆకట్టుకున్నాయి. విజయ్​ సేతుపతి.. విజయ్​ మధ్య వచ్చిన సీన్స్​తో దళపతి అభిమానులకు పూనకాలు వచ్చేసాయట. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్​ అవుతుందని ఓ వార్త బయటకు వచ్చింది. థియేటర్లలో ఈలలు వేస్తూ.. ఎంజాయ్​ చేస్తూ చూద్దామనుకున్న అభిమానులకు ఈ వార్త నచ్చడం లేదట. తాజాగా ఈ విషయంపై హీరోయిన్​ రాధిక కూడా ఓ కామెంట్​ పెట్టింది. ‘ మాస్టర్​ సినిమా థియేటర్​లో కాకుండా ఓటీటీలో రిలీజ్​ అవుతుందని వింటున్నాను.. నాకైతే ఈ సినిమా థియేటర్​లోనే చూడాలని ఉంది.. మరి మీకు’ అంటూ విజయ్​ ఫ్యాన్స్​ను ప్రశ్నించింది. దీంతో చాలా మంది రాధికతో ఏకీభవిస్తున్నారు. మరికొందరేమో ఇటువంటి పరిస్థితుల్లో థియేటర్​లో చూడటం అవసరమా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇళయ దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రాబోతోన్న మాస్టర్‌పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.
Tags:    
  • Master 
  • Vijay 
  • Malavika Mohanan 
  • Lokesh Kangaraj 
  • Vijay Sethupathi 
  • Release 
  • Theatres 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS