రౌడీ క్లబ్బు తెరిచిన దేవరకొండ

Update: 2018-06-11 04:05 GMT
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్ తెలుగు రాష్ట్రాల యువతలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో అతడి పాత్ర.. యాటిట్యూడ్ ఈ తరం యువతకు విపరీతంగా నచ్చేశాయి. ఆ సినిమా తర్వాత వ్యక్తిగత జీవితంలోనూ కొంచెం అదే రకమైన యాటిట్యూడ్ చూపిస్తూ యూత్ ను అట్రాక్ట్ చేస్తుంటాడు విజయ్. అతను ట్విట్టర్లో తన అభిమానుల్ని ప్రతిసారీ ‘రౌడీస్’ అని సంబోధించడం గమనించే ఉంటారు. ఆ రౌడీస్ కోసం ఇప్పుడతను ప్రత్యేకంగా ఒక వెబ్ సైటే పెట్టేశాడు. దానికి ‘రౌడీక్లబ్.ఇన్’ అని పేరు కూడా పెట్టాడు. విజయ్ అభిమానులందరూ ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. అతడికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్లను ఇందులో చూడొచ్చు.

బయట అభిమాన సంఘాలు పెట్టి వాటిని మెయింటైన్ చేసే రోజులు కావివి. ఇప్పుడంతా ఆన్ లైన్ అయిపోతున్న నేపథ్యంలో విజయ్.. తన ఫ్యాన్స్ కోసం వెరైటీ పేరుతో క్లబ్ ఏర్పాటు చేసి వెబ్ సైట్ లాంచ్ చేశాడు. దీనికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ కొత్త సినిమా కోసం అతడి ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే విజయ్ నటించిన ‘టాక్సీవాలా’ అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడం నిరాశ కలిగిస్తోంది. వాయిదాల మీద వాయిదాలు పడటం వల్ల ‘అర్జున్ రెడ్డి’ అడ్వాంటేజీని ఈ చిత్రం కోల్పోతోంది. మే 18కే రావాల్సిన ‘టాక్సీవాలా’ను జులై నెలాఖరుకు పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్-యువి క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News