• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎమ్మెల్యే దేవరకొండలు...

ఎమ్మెల్యే దేవరకొండలు కలవబోతున్నారా?

By - Tupaki Desk
Update: 2019-01-10 07:47 GMT
గత ఏడాది తెలుగు బాక్సాఫీస్‌ ను షేక్‌ చేసిన విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న డియర్‌ కామ్రేడ్‌ వేసవి చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. డియర్‌ కామ్రేడ్‌ పూర్తయిన తర్వాత సెన్సిబుల్‌ డైరెక్టర్‌ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కేఎస్‌ రామారావు నిర్మాణంలో విజయ్‌ దేవరకొండ ఒక చిత్రం చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న సినిమాలో హీరోయిన్‌ ను తాజాగా ఫిక్స్‌ చేశాడు.

విజయ్‌ దేవరకొండకున్న క్రేజ్‌ నేపథ్యంలో ప్రస్తుతం ఆయనతో కలిసి ఏ హీరోయిన్‌ అయినా నటించేందుకు ఆసక్తి చూపడం ఖాయం. అలాంటి విజయ్‌ దేవరకొండ కోసం దర్శకుడు క్రాంతి మాధవన్‌ కేథరిన్‌ తెర్సాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న కేథరిన్‌ కు మంచి అవకాశం ఇప్పటి వరకు దక్కలేదు. దాంతో ఇంకా కూడా సెకండ్‌ గ్రేడ్‌ హీరోయిన్‌ గా ఉంది. అల్లు అర్జున్‌ తో ‘సరైనోడు’ చిత్రంలో నటించి అల్లు అర్జున్‌ తో ఎమ్మెల్యే(మై లక్కీ ఏంజిల్‌) అనిపించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు విజయ్‌ దేవరకొండకు జోడీగా ఎంపికయ్యింది.

కేథరిన్‌ తెలుగులో రానాతో నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తర్వాత మరే సినిమాను చేయలేదు. తమిళం మరియు హిందీల్లో అడపా దడపా అవకాశాలైతే వస్తున్నాయి, కాని ఈమెకు స్టార్‌ గుర్తింపు మాత్రం దక్కడం లేదు. క్రాంతి మాధవ్‌ ఇచ్చిన ఈ ఆఫర్‌ తో అయినా ముద్దుగుమ్మ కేథరిన్‌ తెర్సా తెలుగులో స్టార్‌ డంను దక్కించుకుంటుందేమో చూడాలి. విజయ్‌ దేవరకొండతో నటించిన రష్మిక మందన ఏ స్థాయికి చేరిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్‌ కి ఉన్న క్రేజ్‌ తో కేథరిన్‌ క్రేజ్‌ కూడా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Full View


Tags:    
  • Vijay Devarakonda 
  • Catherine Tresa 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS