సరదాకైనా స్టేజ్ మీద ఈ తిట్లేంది రౌడీ?

Update: 2020-02-10 04:52 GMT
ప్రైవేటుకు.. పబ్లిక్ కు మధ్య ఉన్న తేడాను మర్చిపోవటం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎంత భార్య అయితే మాత్రం.. పబ్లిక్ గా రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అదే సమయం లో ఎంత స్నేహితురాలైతే మాత్రం అందరి ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎంత సరదా అయితే మాత్రం.. సినిమా ఫంక్షన్ లో.. అందరి ముందు మాట్లాడే వేళ.. కాస్త వెనుకా ముందు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అదేమీ పట్టనట్లుగా తనకు నచ్చిన ఫ్లోలో మాట్లాడే మాటలు.. ఎదుటి వారి గౌరవానికి ఇబ్బంది కలిగేలా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తాజాగా యూత్ విపరీతంగా అభిమానించే విజయ్ దేవరకొండ అలియాస్ రౌడీ చేసిన తాజా వ్యాఖ్యలు షాకింగ్ గా ఉన్నాయనే చెప్పాలి.

ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో మాట్లాడిన హీరో విజయ్ దేవరకొండ నోటి నుంచి వచ్చిన మాటలు షాకింగ్ గా మారాయి. తన ప్రసంగం మధ్యలో తనతో సినిమా చేసిన హీరోయిన్ల గురించి సరదాగా మాట్లాడారు.

అలా మాట్లాడే క్రమంలో ఐశ్వర్య రాజేశ్ (తమిళ నటి) ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ఏందే నీ యవ్వ.. గారు గారు అంటున్నావ్’ అంటున్నావ్ అంటూ మాట్లాడిన మాట ఊర మాస్ గా అప్పటికప్పుడు ఇన్ స్టెంట్ గా పలువురి ముఖాల్లో నవ్వులు పూయిస్తే.. సాటి నటి ఎంత స్నేహితురాలైనా కావొచ్చు.. అంతలా అందరి ముందు అనేయటం ఎబ్బెట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్నేహంగా ఉన్నప్పుడు.. ఏరా.. పోరా.. లాంటి మాటలు మామూలే. మోతాదు మించితే.. నీ యమ్మ.. నీ యవ్వ కూడా కొందరి నోట్లో నుంచి వస్తాయి.

ఈ మాటలు తప్పుగా కొందరికి అనిపించక పోవచ్చు. ఎవరైనా హీరోయిన్.. విజయ్ మాదిరే సరదాగా స్టేజ్ మీద.. తనతో పని చేసిన హీరోతో తనకున్న చనువుతో.. ఏందిరా నీయమ్మ.. అదే పనిగా మర్యాద ఇస్తున్నావ్.. సెట్లో నాతో ఉన్నట్లు గా క్లోజ్ గా ఉన్నప్పుడు మాట్లాడేలా మాట్లాడంటే ఎలా ఉంటుంది? నలుగురి ముందు వచ్చినప్పుడు నటించమని చెప్పట్లేదు కానీ.. డీసెంట్ గా ఉండటం చాలా ముఖ్యమన్నది మర్చిపోకూడదు. మరీ.. విషయాన్ని రౌడీ ఎందుకు మిస్ అయినట్లు?


Tags:    

Similar News