శ్రీవిష్ణు విన్యాసం సెన్సార్ సూపర్ సిగ్నల్.. నాన్‌స్టాప్ న‌వ్వులు ఖాయం

సెన్సార్ బోర్డు విష్ణు విన్యాసం సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా ర‌న్ టైమ్ 2 గంటలు గా లాక్ చేయబడింది.;

Update: 2026-02-26 09:15 GMT

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు మరోసారి నవ్వుల పండుగకు సిద్ధమవుతున్నారు. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న ఆయన, ఈసారి విష్ణు విన్యాసం అనే ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైన‌ర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో, సుమంత్ జి నాయుడు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

 

విష్ణు విన్యాసం సెన్సారు పూర్తి

సెన్సార్ బోర్డు విష్ణు విన్యాసం సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా ర‌న్ టైమ్ 2 గంటలు గా లాక్ చేయబడింది. పూర్తి వినోదభరితంగా సాగనున్న ఈ సినిమా ప్రతి సన్నివేశంలోనూ నవ్వులు పూయించనుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో శ్రీ విష్ణు చేసే విన్యాసాలు ఆడియ‌న్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయని సమాచారం. ర‌న్ టైమ్ కూడా 2 గంట‌లే అవ‌డంతో ఇది కూడా సినిమాకు బాగా క‌లిసొచ్చే వీలుంది.

ఈ సినిమాలో శ్రీ విష్ణు పోషిస్తున్న పాత్ర విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది. వాస్తు, జ్యోతిష్యంపై గాఢ నమ్మకం కలిగిన వ్యక్తిగా శ్రీవిష్ణు కనిపించనున్నార‌ని, ఆ నమ్మకాల వల్ల జరిగే వినోదాత్మక సంఘటనలు కథను ముందుకు నడిపిస్తాయ‌ని, శ్రీ విష్ణు స్టైల్‌లో వచ్చే వన్ లైనర్స్, అత‌ని కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్ర‌ధాన‌బలంగా నిలుస్తాయని యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.

సినిమా మొత్తం శ్రీ విష్ణు భుజాల పైనే

న‌య‌న్ సారిక ఎంట్రీ తో మూవీలోని క‌థ మలుపు తిరుగుతుంద‌ని, ఆమె ఎంట‌ర‌య్యాక రొమాంటిక్ కామెడీ ట్రాక్ మరింత ఉత్సాహంగా మారుతుందని, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ ఎంట‌ర్టైన్‌మెంట్‌తో పాటు మంచి ఫీల్‌ను కూడా అందిస్తాయని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్టులుంటూనే కామెడీని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుంద‌ని స‌మాచారం. కథ మొత్తం శ్రీ విష్ణు భుజాల మీదే నడుస్తుందని, విష్ణు విన్యాసం మూవీకి శ్రీవిష్ణు యాక్టింగ్ హైలైట్‌గా నిలుస్తుందని సెన్సార్ తర్వాత వచ్చిన రిపోర్టులు సూచిస్తున్నాయి.

ఫిబ్ర‌వ‌రి 27న విష్ణు విన్యాసం రిలీజ్

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ధ‌న్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా నిలిచాయని తెలుస్తోంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాయని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమవగా, అన్ని ప్రాంతాల్లో మంచి బుకింగ్స్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. వినోదాన్ని ఆశించే ఆడియ‌న్స్ కు ఈ సినిమా పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా నిలుస్తుందనే నమ్మకంతో చిత్రబృందం ఎదురుచూస్తోంది.

Tags:    

Similar News