ప్రొడక్షన్ కష్టాలు నా వల్లగాదు: విజయ్ దేవరకొండ
ఇది వరకు దర్శకులు .. నిర్మాతలు .. హీరోలు .. ఇలా ఎవరి దారిలో వాళ్ల ప్రయాణం సాగుతూ ఉండేది. కానీ ఇప్పుడు దర్శకులు నిర్మాతలుగా మారిపోయారు .. హీరోలు కూడా నిర్మాతల జాబితాల చేరిపోయారు. దర్శకులు .. హీరోలు ఎవరి బ్యానర్లలో వాళ్లు సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే గతంలో నిర్మాతలంటే కేవలం డబ్బులు పెట్టడం మాత్రమే అనుకునేవారికి, ఆ స్థానంలో ఎంత టెన్షన్ ఉంటుందనేది ఇప్పుడు అర్థమవుతోంది. ఎన్ని సవరించుకుంటూ .. సరిచేసుకుంటూ రావాలనేది వాళ్లకి స్పష్టమవుతోంది. విజయ్ దేవరకొండ మాటలే అందుకు నిలువెత్తు నిదర్శనం.
హీరోగా తన ప్రయాణం ప్రారంభించి కొంతదూరం పరిగెత్తగానే విజయ్ దేవరకొండ బిజినెస్ లపై దృష్టి పెట్టాడు. 'రౌడీ' బ్రాండ్ ను రంగంలోకి దింపేశాడు. చాలా సినిమాలు చేసిన హీరోలే సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలా వద్దా అని ఆలోచన చేస్తుండగానే, పోర్టికోలో కారు పెట్టేసినంత తేలికగా ఆయన సొంత బ్యానర్ పెట్టేశాడు. ఈ బ్యానర్ పై ఆయన 'పుష్పక విమానం' సినిమాను నిర్మించాడు. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను నిర్మించాడు. కథా పరంగా చెప్పుకోవాలంటే ఇది ఒక కామెడీ డ్రామా. కొత్త దర్శకుడు .. ఇద్దరు కొత్త హీరోయిన్లు. పెద్దగా బడ్జెట్ అవసరం లేని కథ.
అయితే విజయ్ దేవరకొండ చేయిపడటం వలన ఈ సినిమా జనంలోకి చొచ్చుకుని పోతోంది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. ఈ సినిమా ప్రొడక్షన్ కష్టాలు చెప్పుకొచ్చాడు. "హీరోగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నిర్మాతలు దొరక్క చాలా కష్టాలు పడ్డాను. నా తరువాత వచ్చేవాళ్లు అలాంటి కష్టాలు పడకూడదనే ఉద్దేశంతోనే నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టాను. కానీ నిర్మాణపరమైన పనులు చూసుకోవడం చాలా బాధ్యతతో కూడుకున్న పని అనీ, అది 24x 7జాబ్ లాంటిదని చెప్పాడు. నిద్రపోయేముందు కూడా నేను ఈ సినిమాను గురించి ఆలోచన చేయవలసి వచ్చింది .. అప్పుడు మాత్రం అవసరమా అనిపించింది" చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాతో కొత్తగా పరిచయమవుతున్న వాళ్ల మాటల్లోని ఆనందం చూస్తుంటే, కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడానికి కష్టపడినా ఫరవాలేదనిపించిందని అన్నాడు. ఈ సినిమా ప్రీమియర్ ను ఈ నెల 11వ తేదీ నైట్ చూసేసి తాను 'లైగర్' సినిమా కోసం అమెరికా వెళుతున్నానని అన్నాడు. తనపై తనకి గల నమ్మకంతో .. అభిమానుల పట్ల గల ఓవర్ కాన్ఫిడెంట్ తో ఈ సినిమాను నిర్మిచానని చెప్పాడు. ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లే బాధ్యత మీదే అంటూ అభిమానులకు ఆ బాధ్యతను అప్పగించాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ తన తమ్ముడిని కూడా ప్రమోట్ చేస్తూ .. తన క్రేజ్ ను అన్ని వైపులా వాడేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.