పవర్ స్టార్ పవణ్ కల్యాణ్ టెర్రిఫిక్ ప్లాన్!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ క్రియాశీల రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఎదిగిన పవన్ టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే.;
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ క్రియాశీల రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఎదిగిన పవన్ టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న పవన్ కల్యాణ్ ఓ పక్క రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే మరో పక్క సినిమాల్లోనూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. రాజకీయాలని, సినిమాలని బ్యాలెన్స్ చేసుకుంటూ టెర్రిఫిక్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఒక్కో సినిమాకు పర్టికులర్‌గా కొన్ని డేస్ కేటాయిస్తూ పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో పూర్తి చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ `ఉస్తాద్ భగత్‌సింగ్`. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 19న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో రన్నవుతోంది. ఈ మూవీని పవన్ రాకెట్ స్పీడుతో పూర్తి చేయడం తెలిసిందే. ఈ సినిమా కోసం పవన్ 40 నుంచి 45 రోజుల మాత్రమే కేటాయించి సినిమాని ఆ డేస్‌లోనే పూర్తి చేశారు. ఇప్పుడు ఇదే ప్లాన్‌ని తన తదుపరి సినిమాలకు కూడా అప్లై చేస్తూ చక చకా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకన్నారని తెలిసింది. `ఉస్తాద్ భగత్‌సింగ్` తరువాత పవన్ మరో భారీ యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఈ భారీ ప్రాజెక్ట్‌ని నిర్మించబోతున్నారు. గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న సురేందర్‌రెడ్డి, పవన్‌కల్యాణ్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లిబోతోంది. వక్కంతం వంశీ కథా సహకారం అందిస్తున్నారు. ఈ మూవీకి కూడా పవన్ 45 రోజులు మాత్రమే షూటింగ్‌కు కేటాయిస్తున్నారట. ఆ టైమ్‌లోనే ఆయనకు సంబంధించిన షూటింగ్ పోర్షన్‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాబినేషన్ సీన్‌లు, ఇతరత్రా ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నారట సురేందర్‌రెడ్డి.
దీనితో పాటు పవన్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ భారీ యాక్షన్ డ్రామాని తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా చెబుతున్నారు. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారని, ఈ ప్రాజెక్ట్ కోసం కూడా పవన్ 45 రోజుల కాల్షీట్స్ కేటాయించే అలోచనలో ఉన్నారని ఇన్ సైడ్ టాక్. మోహన్ రాజా ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవితో `గాడ్‌ఫాదర్` మూవీని రూపొందించిన విషయం తెలిసిందే.
ఇందులో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉంటుందని, క్యారెక్టర్ డ్రైవెన్ స్టోరీగా దీన్ని తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో దర్శకుడు మోహన్ రాజా ఉన్నాయని తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అఫీషియల్‌గా ఈ ప్రాజెక్ట్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వర్గాలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. పవన్‌తో తొలి సారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ `బ్రో` మూవీని నిర్మించిన విషయం తెలిసిందే.