జస్టిన్‌పై జీవీ నమ్మకం… హ్యాపీ రాజ్ కు పాజిటివ్ సెంటిమెంట్

ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే మంచి బజ్ నెలకొనగా, ఇటీవల ఒక ఆసక్తికరమైన అంశం ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది.;

Update: 2026-03-20 17:30 GMT

కోలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ ఇప్పుడు హీరోగా తన కెరీర్‌ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా హ్యాపీ రాజ్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గౌరీప్రియ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మార్చి 27న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే మంచి బజ్ నెలకొనగా, ఇటీవల ఒక ఆసక్తికరమైన అంశం ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. స్వతహాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో తాజాగా జీవీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీ

సినిమా ప్రారంభమైన సమయంలో తాను అప్పటికే పలు ప్రాజెక్టులకు కమిట్ అవ్వడం వల్ల హ్యాపీ రాజ్‌కి పూర్తి స్థాయిలో సంగీతం అందించడానికి టైమ్ దొరకలేదని జీవీ వెల్లడించారు. అందుకే ఈ బాధ్యతలను జస్టిన్ ప్రభాకరన్‌కు అప్పగించామని తెలిపారు. జస్టిన్ ప్రభాకరన్ టాలెంట్ పై త‌న‌కు పూర్తి నమ్మకం ఉందని, ఆయన రీసెంట్ గా చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయని జీవీ పేర్కొన్నారు.

జ‌స్టిన్ చేస్తున్న సినిమాల‌న్నీ హిట్లే!

ప్రత్యేకంగా సర్వం మాయ వంటి ప్రాజెక్ట్ బ్లాక్‌బస్టర్ కావడంతో పాటూ, తమిళంలో వ‌చ్చిన సిరాయ్ లాంటి సినిమాలు కూడా ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకోవ‌డం జస్టిన్ టాలెంట్‌ను నిరూపిస్తోందని ఆయన అన్నారు. అదే విధంగా ఇప్పుడు హ్యాపీ రాజ్ కూడా మ్యూజిక్ ప‌రంగా ఆడియ‌న్స్ ను బాగా ఆకట్టుకుంటుందని జీవీ నమ్మకం వ్యక్తం చేశారు.

ఇక డైరెక్ట‌ర్ మరియా రాజా ఈ అంశంపై స్పందిస్తూ, జీవీ ఈ సినిమాలో యాక్టింగ్ పై ఫుల్ ఫోకస్ చేయాలనే ఉద్దేశంతోనే వేరే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను తీసుకున్నామని తెలిపారు. కథకు తగిన విధంగా సంగీతాన్ని అందించగల టాలెంట్ జస్టిన్‌లో ఉందని, ఆయన ఎంపిక సినిమాకు ప్లస్ అవుతుందని దర్శకుడు అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే, హ్యాపీ రాజ్ సినిమా కేవలం ఒక సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాకుండా, టీమ్ తీసుకున్న కొన్ని విభిన్న నిర్ణయాలతో ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ముఖ్యంగా జీవీ ప్రకాష్ కుమార్ తన కంఫర్ట్ జోన్‌ను దాటి నటనపై పూర్తి దృష్టి పెట్టడం, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించడం వంటి అంశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. మరి ఈ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, హ్యాపీ రాజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



Tags:    

Similar News