బన్నీ కొత్త మూవీ.. టీమిండియా క్రికెటర్ వైఫ్ యాక్ట్ చేస్తుందా?

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ లీడ్ రోల్ లో తమిళ స్టార్ డైరెక్టర్‌ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ (AA 23) రూపొందనున్న సంగతి తెలిసిందే.;

Update: 2026-03-21 01:30 GMT

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ లీడ్ రోల్ లో తమిళ స్టార్ డైరెక్టర్‌ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ (AA 23) రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే రాగా.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఆ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోతో ఆ ప్రాజెక్ట్‌ పై అంచనాలు మరింత పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఆ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. బన్నీ వాస్‌ తో పాటు నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో రూపొందనున్న ఆ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ఇక ఆ సినిమా క్యాస్టింగ్‌ విషయానికి వస్తే.. కొన్ని రోజులుగా ఆసక్తికర గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్ పేరు ఫైనల్‌ అయిందని ప్రచారం జరుగుతుండగా, తాజాగా మరో పేరు వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఆ ప్రాజెక్ట్‌ లో భాగమయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్యనే అనుష్క శర్మ అన్న సంగతి తెలిసిందే.

ఏదేమైనా అనుష్క శర్మ.. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీలో నటిస్తుందా లేదా అన్నదానిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వినిపిస్తున్నది అంతా గుసగుసలే కావడంతో, అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఆ కాంబినేషన్ నిజమైతే, ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తుండగా.. ఆ సినిమా తర్వాత ఆయన ఏ దర్శకుడితో మూవీ చేస్తారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఒక దశలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పురాణాల నేపథ్యంలో ఓ చిత్రం ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌ పై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ క్రమంలో లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్‌ రావడం, అల్లు అర్జున్‌ ను కలవడం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది.

ఎందుకంటే కూలీ తర్వాత లోకేశ్ తన లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌ లో భాగంగా ఖైదీ 2పై దృష్టి పెట్టనున్నట్లు గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్‌ తో సినిమా ప్రకటించడంతో ఆ ప్రాజెక్ట్‌ ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే AA 23కి సంబంధించిన కథ ఇప్పటికే ఫైనల్ కాగా, స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. అట్లీ సినిమా పూర్తయ్యాక కొంత బ్రేక్ తీసుకుని అల్లు అర్జున్ లోకేష్ ప్రాజెక్ట్ సెట్స్‌ లోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది సెకండాఫ్ లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News