ఇన్ స్టా వేదిక‌గా కోటిన్న‌ర రౌడీలు

Update: 2022-04-15 14:30 GMT
రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ కొన్ని గంటల క్రితం తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఒక అద్భుత‌ వీడియోను షేర్ చేసి తన ఫాలోవర్లను ఆశ్చర్యపరిచాడు. అడవి మధ్యలో ఒక నిశీధి మార్గంలో ఒంటరిగా నడుస్తూ క‌నిపించాడు ఈ వీడియోలో. అతను తన పోస్ట్ కి `లాంగ్ వాక్స్` అని క్యాప్షన్ ఇచ్చాడు. అతని అందమైన చిరునవ్వు  అందమైన రూపం ఫాలోవ‌ర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇంత‌లోనే విజ‌య్ దేవ‌రకొండ ఇన్ స్టా వేదిక‌గా అరుదైన మైలురాయిని ట‌చ్ చేశాడు. ఇప్ప‌టికి అత‌డిని ఏకంగా కోటిన్న‌ర (1.5 మిలియ‌న్) మంది అనుస‌రిస్తున్నారు.  1.5 మిలియ‌న్ల రౌడీలు అంటూ ప్ర‌చారం హోరెత్తిపోతోంది. ఈ అరుదైన మైలురాయిని అందుకున్న సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ వైన్ గ్లాస్ తో చీర‌ప్ చేస్తున్న ఫోటో వైర‌ల్ గా మారింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..  `లైగర్` చిత్రంతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఛార్మి కౌర్- పూరి- కరణ్ జోహార్- అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవ‌ర‌కొండ స‌ర‌స‌న‌ అనన్య పాండే క‌థానాయిక‌గా న‌టించింది. ఆగ‌స్టులో సినిమా విడుద‌ల కానుంది.
Tags:    

Similar News