ధురంధర్ 2.. కల్కి రికార్డు బ్రేక్ చేస్తుందా?

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా రూపొందిన ధురంధర్: ది రివెంజ్.. ఇప్పుడు అంచనాలను అందుకుని దూసుకుపోతోంది.;

Update: 2026-03-21 06:48 GMT

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా రూపొందిన ధురంధర్: ది రివెంజ్.. ఇప్పుడు అంచనాలను అందుకుని దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్.. మంచి విజయం సాధించడంతో సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్లు సాధిస్తోంది.

వరల్డ్ వైడ్ గా సినిమా అదరగొడుతండగా.. నార్త్ అమెరికాలో ధురంధర్ 2 వసూళ్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అక్కడ ధురంధర్ సీక్వెల్ 3.95 మిలియన్ డాలర్స్ ఓపెనింగ్స్ సాధించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పటి వరకు కలెక్షన్లతోపాటు వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కలిపి ఆ చిత్రం ఉత్తర అమెరికాలో ఇప్పటికే 10.5 మిలియన్ డాలర్ల మార్క్‌ ను దాటినట్లు సమాచారం.

దీంతో విదేశీ మార్కెట్‌ లో సినిమా ఎంతటి హవా సృష్టిస్తోందో క్లియర్ గా తెలుస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్, థియేటర్లలో కనిపిస్తున్న ఆక్యుపెన్సీ దృష్ట్యా.. వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. వీకెండ్ లో కచ్చితంగా భారీ కలెక్షన్స్ సాధించే ఛాన్స్ ఉండగా.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ రికార్డు ధురంధర్ 2 బ్రేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

2024లో రిలీజ్ అయిన కల్కి మూవీ.. నార్త్ అమెరికాలో ఎక్స్టెండెడ్ ఫస్ట్ వీకెండ్ లో 11.2 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. అయితే ప్రస్తుతం ధురంధర్: ది రివెంజ్ జోరు చూస్తుంటే.. ఆ రికార్డు బ్రేక్ అవ్వనున్నట్లు అర్థమవుతోంది. వీకెండ్ ముగిసే సమయానికి ధురంధర్: ది రివెంజ్ 11.2 మిలియన్ డాలర్ల మార్క్‌ ను ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉందని వినికిడి.

అయిదే ధురంధర్ 2 విజయానికి ప్రధాన కారణం సినిమాపై ఉన్న భారీ హైప్, ప్రమోషన్స్, అలాగే రణవీర్ సింగ్ క్రేజ్ అని చెప్పవచ్చు. యాక్షన్, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్ కలిసిన ఆ చిత్రం ఓవర్సీస్ ఆడియన్స్ కు కూడా బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులు ఎక్కువగా ఉన్న ఉత్తర అమెరికా మార్కెట్‌ లో ఆ సినిమాకు పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తుండడం విశేషం.

ఇక సినిమా విషయానికొస్తే.. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌ పై ఆదిత్య ధర్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌ సంయుక్తంగా నిర్మించారు. రణవీర్ సరసన సారా అర్జున్‌ హీరోయిన్ గా నటించగా.. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, మానవ్ గోహిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌ గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌ గా వర్క్ చేయగా, శాశ్వత్ సచ్‌ దేవ్ సంగీతం అందించారు. మార్చి 19న పాన్ ఇండియా రేంజ్ లో సినిమా విడుదలైంది.

Tags:    

Similar News