ధురంధర్.. టాప్ ప్లేస్ కొట్టేసిందిగా..

ధురంధర్ మూవీకి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.;

Update: 2026-03-21 06:31 GMT

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌ లో వచ్చిన ధురంధర్: ది రివెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలకు ముందే చిత్రం రికార్డుల వేట మొదలు పెట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఓ రేంజ్ లో జోరు చూపించిన ఆ యాక్షన్ థ్రిల్లర్.. మొదటి రోజే పాత రికార్డులను బద్దలు కొట్టి రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగించింది.

ధురంధర్ మూవీకి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా హౌస్‌ ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఆసక్తిగా కూర్చుని సినిమా మొత్తం ఆస్వాదించడం విశేషం. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఓవర్సీస్ మార్కెట్‌ లో కూడా ధురంధర్ సీక్వెల్ తన సత్తా చాటింది. విదేశాల్లో ఆ సినిమా సుమారు 3 గంటల 55 నిమిషాల రన్ టైమ్ తో అందుబాటులోకి వచ్చింది. మొదటి భాగం కంటే ఇది కొంత ఎక్కువ నిడివి కలిగి ఉన్నప్పటికీ, అక్కడి ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మూవీ.. ఓవర్సీస్‌ లో 5.20 మిలియన్ డాలర్ల ఓపెనింగ్స్ సాధించినట్లు తెలుస్తోంది.

దీంతో విదేశీ మార్కెట్‌ లో టాప్ బాలీవుడ్ ఓపెనింగ్స్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది ధురంధర్: ది రివెంజ్. ఇప్పటి వరకు ఆ రికార్డు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 మూవీ పేరిట ఉండేది. ఆ చిత్రం విడుదల సమయంలో సుమారు 5 మిలియన్ డాలర్ల ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పుడు ధురంధర్ ఆ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది.

ఇక మూడో స్థానంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ.. 4.94 మిలియన్ డాలర్లతో కొనసాగుతోంది. అయితే ధురంధర్ కు సీక్వెల్ గా వచ్చిన ధురంధర్: ది రివెంజ్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి రణవీర్ సింగ్ నటన. ఆయన పాత్రలో చూపించిన ఎనర్జీ, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్ తన ప్రత్యేకమైన టేకింగ్‌ తో కథను ఆసక్తికరంగా మలిచారు.

సినిమాలో ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి ప్రముఖ నటుల పాత్రలు కూడా బలంగా నిలిచాయి. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం ధురంధర్ కు కలిసొచ్చింది. వీకెండ్ కావడంతో శనివారం, ఆదివారం రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను ధురంధర్ మరోసారి నిరూపించింది. ఓవర్సీస్ నుంచి దేశీయ మార్కెట్ వరకు అన్ని చోట్ల కూడా మూవీ దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే దిశగా ముందుకు సాగుతోంది.

Tags:    

Similar News