అగ్గిపెట్టె మచ్చాకు ఏమైంది? ఎక్కడ ఉన్నాడు?

సోషల్ మీడియాలో యూత్‌ ను ఊపేసిన అగ్గిపెట్టె మచ్చా ప్రస్తుతం కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2026-03-21 06:49 GMT

సోషల్ మీడియాలో యూత్‌ ను ఊపేసిన అగ్గిపెట్టె మచ్చా ప్రస్తుతం కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అతని కోసం ఎక్కడికక్కడ వెతికినా ఎలాంటి సమాచారం లభించడం లేదట..

"ఎక్కడ వెతికినా కనిపించడం లేదు సర్... ఎవరు ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదు. ఎలా ఉన్నాడో కూడా తెలియడం లేదు.. సోషల్ మీడియాలో మాత్రం వీడియోలు కనిపిస్తున్నాయి" అంటూ కుటుంబ సభ్యులు బాధ వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లలో ఆందోళన పెరుగుతోంది. అగ్గిపెట్టె మచ్చా కనిపించడం లేదన్న వార్తల మధ్య రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

కొందరు నెటిజన్లు అతడు చిత్తూరు సిటీలో ఉన్నాడని చెబుతుండగా, మరి కొందరు వేరే ప్రాంతాల్లో చూశామని కామెంట్లు చేస్తున్నారు. అయితే కన్ఫర్మేషన్ లేని సమాచారాన్ని ప్రచారం చేయొద్దని ఇంకొందరు నెటిజన్లు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వొదని కామెంట్లు పెడుతున్నారు. దీంతో అసలు అగ్గిపెట్టె మచ్చా ఎక్కడ ఉన్నాడు అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది.

నిజానికి అగ్గిపెట్టె మచ్చా సోషల్ మీడియాలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. రఫ్‌ గా కనిపించే అతను నమస్తే అన్నా.. అంటూ సంభాషణ మొదలుపెట్టి, తర్వాత తనదైన స్టైల్లో మాట్లాడే విధానం వల్ల యూత్‌ లో మంచి క్రేజ్ సంపాదించాడు. ముఖ్యంగా అతని బూతు పదజాలంతో కూడిన కన్సర్వేషన్స్ వైరల్ అవుతూ, అతడిని ఒక్కసారిగా ఫేమస్ చేశాయని చెప్పాలి.

మొదట్లో కొందరు యువకులు అతడిని ఆటపట్టిస్తూ తీసిన వీడియోలు యూట్యూబ్‌ లో వైరల్ కావడంతో అతని పేరు బయటకు వచ్చింది. అనంతరం కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ కూడా అతడిని ఇంటర్వ్యూలకు పిలిచి ప్రసారం చేయడం ప్రారంభించాయి. ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు కొంత మంది అతనికి డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులతో అతను తన అవసరాలు తీర్చుకుంటూ ఉండేవాడు. పాపులారిటీ కూడా సంపాదించుకున్నాడు.

అయితే ఇలా ఒక సాధారణ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా మీమ్ క్యారెక్టర్‌ గా మారడం విశేషం. అంతేకాదు, అగ్గిపెట్టె మచ్చా పేరుతో ప్లేస్టోర్‌ లో ఏకంగా ఒక మొబైల్ గేమ్ కూడా విడుదలైంది. ఆ గేమ్ లక్షకు పైగా డౌన్లోడ్లు సాధించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడైతే అగ్గిపెట్టె మచ్చా కనిపించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అతని గురించి స్పష్టమైన సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుండగా, మరోవైపు అగ్గిపెట్టె మచ్చా ఆచూకీ లభించిందని వార్తలు వస్తున్నాయి. ఇంటికి తీసుకెళ్లారని టాక్ వినిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో ఆ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News