ధురంధర్ 2పై బాలీవుడ్ మౌనం ఎందుకు?
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనదైన స్టైల్లో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా స్టోరీ, స్క్రిన్‌ప్లే, దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు, కీలక నటీనటుల నటన, దర్శకుడి టేకింగ్, మేకింగ్‌పై ఆసక్తికరంగా స్పందించారు.;
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా `ధురంధర్ 2`. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఆదిత్యధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ మూవీ మార్చి 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల సునామీని సృష్టిస్తోంది. పశ్చిమాసిమాలో యుద్ధమోఘాలు అలుముకున్న వేళ `ధురంధర్ ది రివేంజ్` మాత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చేస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్‌ల విషయలంఓ రికార్డుల మోత మోగించిన `ధురంధర్ 2` ఫస్ట్ రోజే రూ.240 కోట్ల మేర వసూళ్లని రాబట్టి సరికొత్త చర్చకు తెరలేపింది.
ఫస్ట్ పార్ట్ `ధురంధర్` ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కేవలం మౌత్ టాక్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి రూ.1300 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడంతో దీనికి సీక్వెల్‌గా రూపొందిన `ధురంధర్ ది రివేంజ్`పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 19న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సినిమా చూసిన సినీ లవర్స్, సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సౌత్ స్టార్స్ విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనదైన స్టైల్లో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా స్టోరీ, స్క్రిన్‌ప్లే, దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు, కీలక నటీనటుల నటన, దర్శకుడి టేకింగ్, మేకింగ్‌పై ఆసక్తికరంగా స్పందించారు. సౌత్ నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తుంటే బాలీవుడ్ నుంచి మాత్రం కేవలం ప్రీతి జింటా, అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్, రాకేష్ రోషన్ లాంటి వాళ్లు మాత్రమే స్పందించారు. మిగతా వారు మాత్రం సైలెంట్‌గా ఉండి చోద్యం చూస్తున్నారు. బాలీవుడ్ అంటే ఈ నలుగురేనా? మిగతా వాళ్లు ఎక్కడ? ..ఎందుకు స్పందించడం లేదు. అనే చర్చ మొదలైంది.
కరణ్ జోహార్ దగ్గరి నుంచి హృతిక్ రోషన్ వరకు ఈ సినిమాపై ఎందుకు స్పందించడం లేదు?..ఫస్ట్ పార్ట్ రిలీజ్ తరువాత బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ స్పందించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో వైరల్ కాగా నెటిజన్‌ల ఆగ్రహానికి గురికావడం..ఆ తరువాత సైలెంట్ అయిపోవడం తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఆ నలుగురు తప్ప మరే స్టార్, స్టార్ ప్రొడ్యూసర్ స్పదించడం లేదు ఎందుకని? సెక్యులర్ ముసుగులో ఇండియాకు బాలీవుడ్ స్టార్స్ ద్రోహం చేస్తున్నారా? సంఘ విద్రోహ శక్తులతో కలిసి వారి ఫండింగ్‌తో సినిమాలు చేస్తున్నారా? ఆ కారణంగానే ఇండియాకు సపోర్ట్‌గా చేసిన `ధురంధర్`పై స్పందించడం లేదా? అనే చర్చ నెట్టింట జరుగుతోంది.
ఇప్పటి వరకు కరణ్ జోహర్ కానీ, ఆమీర్‌ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో పాటు హృతిక్ రోషన్ లాంటి వాళ్లు స్పందించలేదు. ఇదిలా ఉంటే బాలీవుడ్ సెక్యులర్ మూక తరహాలో దీపిక పదుకునే కూడా స్పందించకపోవడం, కనీసం సోషల్ మీడియా వేదికగా భర్త రణ్ వీర్ నటించిన సినిమాపై పోస్ట్ పెట్టకపోవడం పలువురిని షాక్‌కు గురి చేస్తోంది. భర్త నటించిన సినిమాపై పోస్ట్ పెట్టడానికి దీపికకు ఏం అడ్డు వస్తోందని, అలా పోస్ట్ చేస్తే షారుక్‌తో స్నేహం కట్ అవుతుందనా?.. లేక కరణ్ జోహార్ సినిమాలు లేకుండా చేస్తాడనా? అని నెటిజన్‌లు అనుమానాం వ్యక్తం చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.