రాజాసాబ్ కు అలా.. ఉస్తాద్ ఇలా.. మైత్రీ క్లారిటీ..

టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;

Update: 2026-03-21 07:15 GMT

టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త చిత్రాలతో థియేటర్స్ లో సందడి చేస్తున్న ఆ సంస్థ.. అటు డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ లో దూసుకుపోతోంది. అయితే రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నిర్మించి.. థియేటర్స్ లోకి ఇటీవల తీసుకొచ్చింది.

ఆ సినిమాను నైజాంలో రెగ్యులర్ రేట్లకే రిలీజ్ చేయడం విశేషం. ముఖ్యంగా విడుదలకు కొన్ని రోజుల ముందే ఆ విషయాన్ని ప్రకటించారు. చివరి నిమిషం వరకు లేట్ చేయకుండా డిసెషన్ తీసుకోవడం.. సినిమాకి హెల్ప్ అయిందని చెప్పాలి. రేట్స్ రీజనబుల్ ఉండడం వల్ల ఫుట్ ఫాల్స్ పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ఆడియన్స్ లో కొన్ని రోజులుగా ఓ ప్రశ్న మెదులుతోంది.

అదే రాజా సాబ్ మూవీ ఇష్యూ. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఆ సినిమాను మైత్రీ సంస్థ నైజాంలో గ్రాండ్ గా రిలీజ్ చేసింది. కానీ చివరి నిమిషం వరకు రేట్స్ విషయంలో డిలే చేసింది. దాని వల్ల కొన్ని చోట్ల మాత్రమే ప్రీమియర్స్ వేయగలిగింది. దీంతో ఇప్పుడు ఉస్తాద్ విషయంలో జాగ్రత్త పడ్డ మైత్రీ.. అప్పుడు రాజాసాబ్ టైమ్ లో ఎందుకు అలా చేసిందనే డౌట్ అందరిలో ఉంది.

ఇప్పుడు ఆ విషయంపై మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ కు బాధ్యత వహిస్తున్న శశి.. ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడారు. "అప్పుడు రాజా సాబ్ మూవీ టైమ్ కోర్టులో ఐదు కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ విషయం మాకు తెలియదు. ఆ ఐదు కేసులు పుటప్ చేయాల్సి వచ్చింది. సినిమా శుక్రవారం రిలీజ్ అంటే.. బుధవారం సాయంత్రం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్డర్స్ రావడానికి నైట్ అయింది" అని తెలిపారు.

"అలా కోర్టు ఆర్డర్లు వచ్చిన వరకు రేట్లు కోసం ప్రభుత్వానికి అప్లై చేయలేకపోయాం. అవి వచ్చాక గురువారం మార్నింగ్ అప్లై చేశాం. అందుకే అలా జరిగింది. గవర్నమెంట్ నుంచి లైట్ నైట్ వచ్చాయి ఆర్డర్స్. పెద్ద సినిమాలు చేసినప్పుడు అమౌంట్ పై అన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి అప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోలేకపోయాం" అని శశి చెప్పారు.

"ఏదేమైనా మొదటిసారి దెబ్బతినడం ఓకే.. రెండోసారి ఛాన్స్ తీసుకోకూడదు. అందుకే నవీన్ గారు, రవిశంకర్ గారు ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేశారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కూడా రేట్స్ కు అప్లై చేశాం. కానీ ఇబ్బందులు ఉన్నాయని తెలిసి మళ్లీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేందుకు డ్రాప్ అయ్యి నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా రేట్ల విషయంలో సరైన సొల్యూషన్ కోసం చూస్తున్నాం" అని శశి తెలిపారు. అలా రాజా సాబ్, ఉస్తాద్ రేట్ల విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News