రౌడీ బాబు ఇది నిజమేనా?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజా ఇంటర్వ్యూలో బాంబు పేల్చాడు. తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తన నిర్మాణంలో రూపొందిన పుష్పక విమానం సినిమా విడుదల కు సిద్దం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొన్ని రోజుల క్రితం తమ్ముడితో కలిసి చిట్ చాట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సమయంలో మరో వీడియోను రౌడీ బ్రదర్స్ షేర్ చేశారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను గురించి మాట్లాడారు. ఆ సందర్బంగానే విజయ్ దేవరకొండ సింగిల్ గా ఉన్నాడా లేదా మింగిల్ అయ్యి ఉన్నాడా అంటూ ఒక ప్రశ్న వచ్చింది. ఆ సమయంలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
మొన్నటి వరకు మింగిల్ గా ఉన్న తాను ఇప్పుడు సింగిల్ అయ్యాను. నాకు ఇటీవలే బ్రేకప్ అయ్యింది అంటూ విజయ్ దేవరకొండ ప్రకటించాడు. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియదు అన్నాడు. విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నాడు అంటూ ఆమద్య పుకార్లు షికార్లు చేశాయి. రష్మికతో అని.. ఒక ఇంగ్లీష్ అమ్మాయితో అంటూ ప్రచారం జరిగింది. కాని అవేవి నిజం కాదని ఆ తర్వాత తర్వాత క్లారిటీ ఇచ్చారు. కాని విజయ్ దేవరకొండ ఎవరితో ప్రేమలో ఉన్నాడని ఇప్పుడు బ్రేకప్ అయ్యాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అసలు రౌడీ చెప్పింది నిజమేనా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం రౌడీ స్టార్ కు బ్రేకప్ శుభాకాంక్షలను ఫన్నీగా చెప్తున్నాడు.
విజయ్ దేవరకొండ బ్రేకప్ ప్రకటన పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా పుష్పక విమానం పబ్లిసిటీ కోసం ఇలాంటి జిమ్మిక్కులను రౌడీ స్టార్ ప్రయోగిస్తున్నాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ కదా అంటున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ బ్రేకప్ విషయం హాట్ టాపిక్ అయ్యింది. చిన్న లీక్ ఇచ్చి వదిలిన రౌడీ ఇప్పుడు ఆ టాపిక్ పెద్దగా అవ్వడంతో సైలెంట్ అయ్యాడు. జనాలు మాత్రం ఇష్టానుసారంగా ఆ లీక్ ను విస్తరిస్తూ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుందో అనేది చూడాలి.