మిల‌ట‌రీ మేన్‌గా మారిపోతున్న రౌడీ స్టార్‌

Update: 2022-02-27 01:30 GMT
మ‌న హీరోల్లో ఇప్ప‌డు ఎవ‌రిని క‌దిలించినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట పాన్ ఇండియా. ప్ర‌స్తుతం ఇండియా వైడ్ గా తెలుగు చిత్రాల‌కు హ్యూజ్ మార్కెట్ ఏర్ప‌డ‌టంతో ప్ర‌తీ హీరో పాన్ ఇండియా స్థాయిలో త‌న మార్కెట్ ని పెంచుకోవాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నుంచి నేచుర‌ల్ స్టార్ నాని వ‌రకు అంతా ఇప్ప‌డు ఇదే పంథాని అనుస‌రిస్తూ త‌మ చిత్రాల‌ని రెడీ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్‌, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ లు గా మారిపోయారు. ఇదే వ‌రుస‌లో విజ‌య్ దేవ‌రకొండ కూడా పాన్ ఇండియా మూవీతో రానున్న విష‌యం తెలిసిందే.

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం `లైగ‌ర్‌`. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ బాక్స‌ర్, హాలీవుడ్ స్టార్ మైక్ టైస‌న్ ఈ చిత్రంలో కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీంతో ఈ మూవీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఓ బాక్స‌ర్ స్టోరీగా తెర‌పైకొస్తున్నా ఈ మూవీ మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ మూవీతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మిల‌తో క‌లిసి బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూస‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

భారీ ప్ర‌త్యేక‌త‌ల తో స‌ర్ ప్రైజింగ్ అంశాల‌తో క్రేజీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ ఆగ‌స్టు 25న తెలుగు, హిందీతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ - పూరి జ‌గ‌న్నాథ్ క‌లిసి మ‌రో భారీ చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ `జ‌న‌గ‌ణ‌మ‌న‌`. ఈ ప్రాజెక్ట్ ని `లైగ‌ర్` త‌రువాత స్టార్ట్ చేయ‌బోతున్నారు.

ఇందులోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని తెలిసింది. ఏప్రిల్ లో ఈ ప్రాజెక్ట్ లాంఛ‌నంగా ప్రారంభిం కానుంద‌ని తెలిసింది. `లైగ‌ర్‌`లో లాంగ్ హెయిర్ తో బాక్స‌ర్ గా క‌నిపించిన విజ‌య్ దేవ‌ర‌కొండ `జ‌న‌గ‌ణ‌మ‌న‌`లో మాత్రం షార్ట్ హెయిర్ తో క‌నిపించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మిల‌ట‌రీ హెయిర్ క‌టింగ్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపిస్తాడ‌ట‌. ఇప్ప‌టికే లొకేష‌న్ ల రెక్కీని నిర్వ‌హించిన టీమ్ ఫ‌స్ట్ షెడ్యూల్ కోసం ఆస‌క్తిక‌ర‌మైన ప్లేస్ ని ఫిక్స్ చేసింద‌ట‌.

ఫ‌స్ట్ షెడ్యూల్ ని సౌత్ ఆఫ్రిక‌లో ప్రారంభించ‌డానికి ఇప్ప‌టికే పూరి జ‌గ‌న్నాథ్ ఏర్పాట్లు కూడా చేస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ మిలిట‌రీ ఆఫీస‌ర్ గా క‌నిపిస్తార‌ని, `లైగ‌ర్‌` పూర్తి కాగానే ఆ పాత్ర కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ మొద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రం కోసం విజ‌య్ కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ని అనుకుంటున్నార‌ని, జాన్వీ క‌పూర్ ని సంప్ర‌దించే అవ‌కాశాలు వున్నాయ‌ని తెలిసింది. విజ‌య్ పై క్ర‌ష్ వుంద‌ని ఆ మ‌ధ్ ఓ షోలో చెప్పిన జాన్వీ క‌పూర్ .. పూరి జ‌గ‌న్నాథ్ ఆఫ‌ర్ ని ఈ సారైనా ఓకే చేస్తుందా చూడాలి అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. 
Tags:    

Similar News