కొత్త ఏడాది రోజున విజ‌య్-ర‌ష్మిక పై ప‌డ్డారేంటి?

Update: 2023-01-01 16:30 GMT
రౌడీబోయ్  విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్` ప్లాప్ ని లైట్ తీసుకుని ముందుకు సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే.  రిలీజ్ అయిన కొత్త‌లో కొన్ని ర‌కాల విమర్శ‌లు ఎదుర్కున్న‌ప్ప‌టికీ `ఖుషీ` సినిమా షూట్ లో  బిజీ అవ్వ‌డంతో అన్నీ తొల‌గిపోయాయి. ప్ర‌స్తుతం రెట్టించిన ఉత్సాహంలో `ఖుషీ` షూట్ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ కూడా క్లైమాక్స్  కి  వ‌స్తుంది.

తాజాగా నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని ఓ ఆస‌క్తిర పోస్ట్ ..ఫోటో పెట్టాడు. అందులో విజ‌య్ బీచ్ ప‌క్క‌నే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో  మ‌ద్యం బాటిల్ చేత్తో ప‌ట్టుకుని క‌నిపించారు. `ఒక ఏడాది మ‌నకి ఎన్నో జ్ఞాప‌కాలు అందించింది. ఎన్నోసార్లు గ‌ట్టిగా న‌వ్వుకున్నాం. ల‌క్ష్యాలు సాధించ‌డానికి ప్ర‌య‌త్నించాం. కొన్ని గెలిచాం. కొన్ని ఓడిపోయాం.

మ‌నం ప్రతీదాన్ని సెల‌బ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే అదే జీవితం అంటూ ఆ ఫోటోకి క్యాప్ష‌న్ ఇచ్చాడు. దీన్ని చూసిన నెటి జ‌నులు ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. అన్నా నువ్వు గ‌తేడాది నువ్వు..ర‌ష్మిక క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లిన‌ప్పుడు ఈ ఫోటో తీసుకున్నావు క‌దా.... ఈ లొకేష‌న్ మాల్దీవుల్లా ఉందే? ర‌ష్మిక ఫోటోలు  షేర్చేసిన స‌మ‌యంలోనే మీరు కూడా వీటిని షేర్ చేసి ఉంటే మేము ఆనందించే వాళ్లం.

మీ ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫోటోల కూడా షేర్  చేయోచ్చు క‌దా` అని ఒక‌రు కామెంట్ చేసారు. మ‌రోవైపు రౌడీ అభిమానులు ఈ కామెంట్లు చూసి  గుసాయిస్తున్నారు. `ఆయ‌న మంచి సందేశం పెట్టిన‌ప్పుడు దాన్ని ప‌ట్టించుకోవ‌డం మానేసి ఈ ఫోటోపై ప‌డ్డారేంటి? అని అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఈ కామెంట్ల‌పై విజ‌య్ ఏమంటాడో?  ర‌ష్మిక టాపిక్ ని కూడా లేవ‌నెత్తారు కాబ‌ట్టి ఆమె కూడా ఈ సీన్ లోకి  వ‌స్తుందేమో!  చూడాలి. ప్ర‌స్తుతం ఆ బ్యూటీ న్యూ ఇయ‌ర్ ని ఆస్వాదించే ప‌నిలో ప‌డింది.  కొత్త సంవ‌త్స‌రం వ‌స్తే ఇంటి ప‌ట్టున ఉండ‌ద‌ని.. ఊరుమీద పతిరుగ‌తుంద‌ని తెలిపింది. మ‌రి ర‌ష్మిక ఇప్పుడు ఏ మోడ్ లోఉందో.
Tags:    

Similar News