నార్త్ లో 'ప్యారడైజ్'.. ఫస్ట్ డే లెక్క ఎలా ఉందంటే?
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందిన ది ప్యారడైజ్ మూవీ ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందిన ది ప్యారడైజ్ మూవీ ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఆ మూవీ.. నార్త్ లో లిమిటెడ్ స్క్రీన్లతో రిలీజ్ అయింది. కానీ ఫస్ట్ డే మాత్రం సాలిడ్ వసూళ్లు అందుకుంది. గురువారం రిలీజ్ అయినప్పటికీ హిందీ వెర్షన్ కు వచ్చిన ఓపెనింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ది ప్యారడైజ్ మూవీ హిందీ వెర్షన్ తొలి రోజు రూ.2.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసింది. నాని కెరీర్ లో నార్త్ ఇండియాలో ఇదే ది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని ప్యారడైజ్ మేకర్స్ వెల్లడించారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో స్క్రీన్లు లేకుండానే ఆ రేంజ్ లో వసూళ్లు రావడం సినిమాకు కలిసొచ్చే అంశంగా మారిందని చెప్పాలి.
ఇక ఫస్ట్ డే కంటే సెకండ్ డే వసూళ్లు మరింత స్ట్రాంగ్ గా ఉన్నాయని మూవీ టీమ్ చెబుతోంది. వీకెండ్ కూడా ముందుండటంతో నార్త్ లో ది ప్యారడైజ్ లెక్కలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో వరల్డ్ వైడ్ గా రెండో రోజే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను ప్యారడైజ్ దాటినట్లు తెలుస్తోంది. దీంతో ఫస్ట్ వీకెండ్ కల్లా సినిమా సాలిడ్ కలెక్షన్స్ సాధించేలా ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే సినిమాలో నాని లీడ్ రోల్ లో కనిపించగా.. ఆయనకు జోడీగా యంగ్ బ్యూటీ కయాదు లోహర్ నటించారు. నాని పోషించిన జడల్ జమానా పాత్రకు ధీటుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకమైన శికంజా మాలిక్ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు బాలీవుడ్ నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించారు.
నాని తల్లిగా ప్రముఖ నటి సోనాలి కులకర్ణి నటించారు. సంపూర్ణేష్ బాబు కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఇలా తెలుగు, బాలీవుడ్ కు చెందిన క్యాస్టింగ్ ను కలిపి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆ కథను స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన మూవీ కావడంతో ప్యారడైజ్ పై మొదటి నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి నాని పూర్తిగా రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించారు.
1947 నుంచి 1980ల మధ్య సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో స్టోరీ సాగుతుంది. సినిమాకు భారీ యాక్షన్ ట్రీట్మెంట్ ఉండటంతో A సర్టిఫికెట్ వచ్చింది. అయితే ఆ అంశాన్ని పక్కన పెడితే.. నాని మేకోవర్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు స్త్రెంత్ గా నిలిచింది.