తమన్నా మరో గోల్‌ మిస్‌ ఫైర్‌..!

మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి ఫెయిల్యూర్‌ను చవిచూడాల్సి వచ్చింది. బాలీవుడ్ యంగ్ స్టార్‌ సిద్దార్థ్‌ మల్హోత్రతో కలిసి తమన్నా నటించిన మూవీ 'ది వాన్‌ : ఫోర్స్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌' తాజాగా బాక్సాఫీస్‌ వద్దకు వచ్చింది.

Update: 2026-09-25 16:37 GMT

మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి ఫెయిల్యూర్‌ను చవిచూడాల్సి వచ్చింది. బాలీవుడ్ యంగ్ స్టార్‌ సిద్దార్థ్‌ మల్హోత్రతో కలిసి తమన్నా నటించిన మూవీ 'ది వాన్‌ : ఫోర్స్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌' తాజాగా బాక్సాఫీస్‌ వద్దకు వచ్చింది. ఈ సినిమాపై తమన్నా చాలా ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్‌ హిట్‌ మూవీ స్త్రీ తరహాలోనే ఒక హర్రర్‌ కాన్సెప్ట్‌తో, కామెడీ నేపథ్యంలో రూపొందిన ది వాన్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేసిన మేకర్స్‌ చాలా ఆశలు పెట్టుకుని విడుదల చేశారు. పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు, ఎక్కువ గ్యాప్‌ తర్వాత విడుదల చేయడం జరిగింది. అయినా కూడా కాలం కలిసి రాలేదు. సినిమాలోని కంటెంట్‌ మరీ పూర్‌గా ఉండటంతో పాటు, హీరో, హీరోయిన్‌ పాత్రల విషయంలోనూ విమర్శలు వచ్చే విధంగా కథ, కథనం ఉండటంతో మినిమం వసూళ్లు నమోదు కావడం లేదు.

ది వాన్ సినిమాతో తమన్నా...

ది వాన్‌ సినిమా మొదటి రోజు దాదాపుగా రూ.5 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు చెబుతున్నారు. వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి సినిమా కనీసం పాతిక కోట్ల మార్క్‌ అయినా క్రాస్‌ చేసేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాకు పెట్టిన బడ్జెట్‌, బయ్యర్లు పెట్టిన పెట్టుబడి రావాలంటే కనీసం రూ.100 కోట్ల వసూళ్లు రావాల్సి ఉందని బాలీవుడ్‌ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. కానీ సినిమా అందులో సగం అయినా రాబట్టేనా అంటే కష్టమే అన్నట్టుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు దీపక్‌ కుమార్‌ మిశ్రా దర్శకత్వం వహించాడు. ఒక పల్లెటూరు నేపథ్యంతో పాటు, హర్రర్‌ కాన్సెప్ట్‌ తీసుకున్న దర్శకుడు పూర్తిగా మూస పద్దతిలోనే సినిమాను నడిపించాడు. స్క్రీన్‌ ప్లేలో ఎక్కడ చూసినా కొత్తదనం లేకపోవడంతో హీరో, హీరోయిన్‌ ఇతర నటీనటుల కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది.

బాలీవుడ్‌లో భారీ మూవీగా...

ఈ సినిమాతో తమన్నా కచ్చితంగా ఒక హిట్‌ కొడుతుందని, దాంతో బాలీవుడ్‌లో మరిన్ని సినిమాలతో తమన్నా బిజీ కావడం ఖాయం అని ఆమె అభిమానులు భావించారు. కానీ సినిమా ఫెయిల్యూర్‌ ను చవిచూడటంతో తమన్నా ఖాతాలో మరో హిందీ ఫ్లాప్‌ మూవీ పడింది. ఇప్పటికే తమన్నా చాలా హిందీ సినిమాలు చేసింది. వాటిల్లో మెజార్టీ శాతం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడ్డాయి దాంతో మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌ ఖతం అని అంతా అనుకున్నారు. కానీ లక్కీగా తమన్నాకు ఏదో ఒక రకంగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్ లేదా ప్రత్యేక పాత్రలు ఇలా ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో పూర్తిగా బాలీవుడ్‌ పైనే దృష్టి పెట్టిన తమన్నా చేతిలో మరో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటితో అయినా హిట్‌ కొట్టేనా చూడాలి.

తమన్నా వరుస ఫ్లాప్స్‌...

తమన్నా లక్‌ బాగుండి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి, కానీ ఆ ఆఫర్లు హిట్స్ గా మాత్రం మారడం లేదు. తమన్నా కళ్లు మూసుకుని వరుసగా గోల్‌ వైపు బాల్‌ ను తన్నుతున్నా, ఆమెకు మాత్రం లక్‌ కలిసి రావడం లేదు. వరుసగా గోల్స్ మిస్‌ అవుతున్నాయి. అయితే ఏదో ఒక సమయంలో కచ్చితంగా తమన్నా గోల్‌ కొడుతుందని, దాంతో మరికొంత కాలం ఇండస్ట్రీలో తమన్నా ఉంటుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. మిల్కీ బ్యూటీ రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో సక్సెస్‌లు చాలా తక్కువే అని చెప్పాలి. అయినా కూడా తన అందంతో ఆఫర్లు దక్కించుకుంటూ వస్తుంది. మరో అయిదు ఏళ్లు తమన్నా బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని ఆమె సన్నిహితులు అంటున్నారు. అయితే ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాదిలో అయినా తమన్నాకు ఒక్క కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ పడితే అయిదు ఏళ్ళు ఏంటి మరో ఐదు ఏళ్లు కూడా ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News