'రాకా' ఆలస్యానికి కారణం ఇదేనా?

కానీ వారం రోజులుగా అదుగో... ఇదుగో అంటున్నారు తప్ప గ్లిమ్స్‌ ను మాత్రం విడుదల చేయక పోవడంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2026-09-25 16:30 GMT

అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న పాన్‌ ఇండియా భారీ బడ్జెట్‌ మూవీ 'రాకా' మరోసారి జాతీయ స్థాయి మీడియాలో చర్చనీయాంశం అయింది. గత కొన్ని రోజులుగా రాకా సినిమా గ్లిమ్స్‌కు సంబంధించి హడావిడి నడుస్తున్న విషయం తెల్సిందే. మూడు రోజుల క్రితం అట్లీ బర్త్‌డే సందర్భంగా 'రాకా' గ్లిమ్స్‌ను విడుదల చేయాలని భావించారు. కానీ గ్లిమ్స్ రెడీ కాకపోవడంతో అట్లీ బర్త్‌డే ను స్కిప్‌ చేయాల్సి వచ్చింది. అల్లు అర్జున్‌ ఇప్పటికే రాకా గ్లిమ్స్ కి కావాల్సిన షూటింగ్‌తో పాటు, డబ్బింగ్‌ పూర్తి చేశాడని, ఏ క్షణంలో అయినా గ్లిమ్స్ సోషల్‌ మీడియాను షేక్ చేసేందుకు రావడం ఖాయం అంటూ అల్లు అర్జున్‌ అభిమానులకు సందేశం అందిందట. కానీ వారం రోజులుగా అదుగో... ఇదుగో అంటున్నారు తప్ప గ్లిమ్స్‌ ను మాత్రం విడుదల చేయక పోవడంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌, అట్లీ కాంబో మూవీ...

అట్లీ ఆ మధ్య ఒక చిట్‌చాట్‌లో గ్లిమ్స్‌తో సినిమా ఏంటో చూపించబోతున్నట్లు చెప్పాడట. దాంతో ఎప్పుడు రాకా గ్లిమ్స్ వస్తాయా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు, రెగ్యులర్‌ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాకా గ్లిమ్స్‌కు సంబంధించి ఒక టీమ్‌ గత రెండు వారాలుగా వర్క్‌ చేస్తుంది. ఇప్పటికే రెడీ అయిన ఫుటేజ్‌ నుంచి గ్లిమ్స్ కోసం కొన్ని షాట్స్ తీసుకుని వీడియోను రెడీ చేస్తున్నారు. రెండు మూడు వర్షన్‌ల గ్లిమ్స్‌ ను రెడీ చేశారని, వాటిల్లో ఏ ఒక్కటి అల్లు అర్జున్‌, అట్లీలకు నచ్చలేదని, అంతకు మించి ఉండాలని వారు ఆ టీంకి చెప్పడంతో ఇప్పుడు మళ్లీ రీ ఎడిట్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ఇప్పుడు ప్రత్యేక సందర్భం ఏమీ లేదు కనుక మెల్లగానే గ్లిమ్స్‌ ను రెడీ చేయమని అట్లీ వారితో చెప్పాడని సమాచారం అందుతోంది.

రాకా సినిమా కోసం అంతా రెడీ...

రాకా సినిమా గ్లిమ్స్‌ ను దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు అట్లీ కోరుకున్న విధంగా గ్లిమ్స్ ఔట్‌ పుట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని, గ్లిమ్స్‌ తో సినిమా స్థాయి పెంచే విధంగా అట్లీ ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్‌ సైతం రాకా గ్లిమ్స్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాడు. సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్‌ లుక్‌ తో వచ్చిన హైప్‌ కి డబుల్‌ హైప్‌ వచ్చే విధంగా రాకా గ్లిమ్స్ ఉండాలని అల్లు అర్జున్‌ టీంతో చెప్పాడట. అందుకే అట్లీ అందుకోసం చాలా వర్కౌట్‌ చేస్తున్నాడు. మ్యూజిక్ నుంచి ప్రతి షాట్‌ వరకు అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ గ్లిమ్స్ ను రెడీ చేస్తున్నారు. అందుకోసం పెద్ద టీం పూర్తి సమయం కేటాయించారు. కనుక కచ్చితంగా ఆలస్యం అయినా గ్లిమ్స్ అద్భుతంగా రావడం ఖాయం అని బన్నీ ఫ్యాన్స్‌కి యూనిట్‌ సభ్యులు హామీ ఇస్తున్నారు.

రాకా గ్లిమ్స్ విడుదల ఆలస్యం...

రాకా గ్లిమ్స్‌ ఆలస్యంకు ప్రధాన కారణం ప్రతి ఫ్రేమ్‌ అద్భుతంగా ఉండాలనే ఉద్దేశంతో టైం తీసుకుంటున్నారు. సినిమా స్థాయిని పెంచే విధంగా గ్లిమ్స్ లోని ప్రతి షాట్‌ ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే అభిమానులు నిరుత్సాహ పడ్డా కూడా మెల్లగానే గ్లిమ్స్ ను రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీపికా పదుకునేతో పాటు పలువురు స్టార్‌ హీరోయిన్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు, తమిళ్‌లోనూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. సాయి అభ్యంకర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సైన్స్‌ ఫిక్షన్‌, యాక్షన్‌ డ్రామా కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి మీరు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారా?

Tags:    

Similar News