20వేల ఎకరాల్లో మైనింగ్ మానవాళికి ముప్పే!- దేవరకొండ
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నల్లమల అడవులు భవిష్యత్ లో అంతం కావడం ఖాయం. ఇక్కడ యురేనియం ధాతువు అధికంగా లభ్యమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. దాదాపు 20వేల ఎకరాల్లో ఉన్న నల్లమల అడవుల్ని ధ్వంశం చేసి ధాతువు వేటను సాగించనున్నారు. అయితే దీనిపై తెలంగాణ సహా తెలుగు రాష్ట్రాల్లో వ్యతిరేకత నెలకొంది. సెలబ్రిటీలు దీనికి వ్యతిరేకంగా తమ గొంతును వినిపిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సహా ఎందరో దీనికి వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నారు.
ఇక నైజాం యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా నల్లమల అడవులను నరికేసేందుకు వ్యతిరేకం. ఓ ఇంటర్వ్యూలో తన వ్యతిరేకతను కూడా వెలిబుచ్చుతూ యురేనియం పేరుతో విధ్వంశం తగదని అన్నాడు. అంతేకాదు.. నల్లమల అడవుల గుండా కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదిలో నీటినే ప్రజలు తాగుతున్నారు. ఈ బెల్ట్ ని తవ్వి యురేనియం తీయడం వల్ల నీరు విషంగా మారుతుంది. ఈ నీటిని తాగడం ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున ప్రమాదంలో పడతారు. దీనికి నేను వ్యతిరేకం అని వివరణ ఇచ్చారు. అడవుల్ని నాశనం చేయడమే గాక నీటి వనరుల్ని కలుషితం చేయడం ద్వారా నాశనం కోరుకుంటున్నామని అన్నారు.
అంతేకాదు.. ఏ విద్యుత్ అవసరాల కోసం యురేనియం తవ్వి తీయాలనుకున్నారో అది కొన్నాళ్లకు అంతమవుతుంది. యురేనియం నిల్వలు తగ్గిపోయాక మానవాళి తిరిగి విద్యుత్ కోసం వెతకాలి. దానికంటే ఆల్టర్నేట్ రెన్యువల్ విద్యుత్ కోసం ప్రయత్నించాలి. సౌర విద్యుత్ ని విరివిగా సద్వినియోగం చేయాలి. దానికి సాంకేతికత అందుబాటులో ఉంది.. అని దేవరకొండ అన్నారు. ఇది మా ఇంటి సమస్య కాదు! అని ప్రజలు వదిలేయకూడదు. అందరూ నల్లమల తవ్వకాల్ని ఆపేయాలంటూ నినదించాలని కోరారు.