సమంత కల నెరవేరుతున్న సమయం

Update: 2021-02-11 03:08 GMT
ఎంత పెద్ద స్టార్‌ అయినా డ్రీమ్‌ రోల్‌ కాని డ్రీమ్ కాంబో కాని ఉంటుంది. స్టార్స్ అయినా కూడా వారితో కలిసి పని చేయాలి.. వీరి దర్శకత్వంలో పని చేయాలనే ఆలోచన ఆసక్తి ఉంటుంది. స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా తనకు స్టార్‌ నటుడు విజయ్ సేతుపతితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని చాలా కాలంగా ఉంది. అలాగే లేడీ సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌ ఉన్న నయనతారతో కూడా నటించాలనే ఆసక్తి సమంతకు ఉంది. ఆ విషయాలను పలు సందర్బాల్లో ఇంటర్వ్యూలో సమంత చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ సందర్బం సమయం వచ్చేసింది. తాను కోరుకున్న వారితో ఒకేసారి కలిసి నటించే అవకాశంను సమంత దక్కించుకుంది. ప్రస్తుతం సమంత తన డ్రీమ్ కాంబోతో వర్క్ చేస్తున్నారు.

సమంత తమిళంలో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో సమంతతో పాటు మరో హీరోయిన్‌ గా నయనతార నటిస్తుండగా కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఇదో ట్రైయాంగిల్‌ లవ్ స్టోరీగా సమాచారం అందుతోంది. నయనతార ప్రియుడు అయిన విఘ్నేష్‌ శివన్‌ ఈ సినిమాను రూపొందిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మరియు కీలక పాత్రలో సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సమ్మర్‌ చివరి వరకు గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమా కోసం తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News