క్రియేటివిటీతో నయన్‌ ను సర్‌ ప్రైజ్‌ చేశాడు

Update: 2018-11-18 16:20 GMT
సౌత్‌ సినీ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఆమె అభిమానుల నుండి పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు అందాయి - సినీ వర్గాల వారు మరియు ఆమె బంధు మిత్రులు అంతా కూడా ఎవరికి తోచిన విధంగా వారు నయన్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే నయన్‌ ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ మాత్రం చాలా విభిన్నంగా నయన్‌ కు బర్త్‌ డే విషెష్‌ చెప్పి ఆమెను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు.

స్వతహాగా దర్శకుడు అయిన విఘ్నేష్‌ శివన్‌ నయన్‌ ఫొటో తో ఒక ప్రత్యేకమైన కేక్‌ ను తయారు చేయించాడు. కేక్‌ పై లేడీ సూపర్‌ స్టార్‌ అని రాయడంతో పాటు సినీ వాతావరణం కనిపించేలా కెమెరా, క్లాప్‌ బోర్డ్‌, స్క్రిప్ట్‌ బుక్‌ పెట్టాడు. విఘ్నేష్‌ శివన్‌ కేక్‌ చూపించగానే నయన్‌ సర్‌ ప్రైజ్‌ అయ్యిందట. నయన్‌ బర్త్‌ డే పార్టీ కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. పెళ్లి విషయం ప్రస్తావిస్తే మౌనం వహిస్తున్న ఈ జంట పార్టీలు - విదేశాల్లో టూర్‌ లు - పండుగలు అంటూ జంట పక్షుల్లా తెగ తిరిగేస్తున్నారు.

తమిళ మీడియా వర్గాల్లో వీరిద్దరి వివాహం అయ్యిందనే  టాక్‌ వినిపిస్తుంది. పెళ్లి అయ్యిందనే వార్త బయటకు చెప్తే నయన్‌ సినీ ఆఫర్లు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో చెప్పడం లేదని కొందరు అంటున్నారు. అయితే కొందరు మాత్రం పెళ్లి కాలేదు కాని ఇద్దరు సహజీవనం సాగిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉందని ప్రశంసలు దక్కించుకుంటుంది.

Tags:    

Similar News