చీరలో క్రికెట్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచిన మిథాలీ
స్పోర్ట్స్, గేమ్స్ ఆడాలంటే వాటికి ప్రత్యేకమైన దుస్తులుంటాయి. లుజుగా, వదులుగా, కంఫర్ట్ గా, గాలి ఆడేలా.. సాగేలా ప్యాంట్, షర్ట్ లను ప్రత్యేకంగా తయారు చేసినవి క్రీడాకారులు ధరిస్తారు. అయితే క్రీడలు ఆడడానికి అస్సలు సూట్ కాని డ్రెస్ ఏదైనా ఉందంటే అదీ ‘చీర’నే.
అవును చీర ఏమాత్రం పరిగెత్తినా ఆటలు ఆడినా ఊడిపోతుంది. అది అస్సలు కంఫర్టే కాదు. కానీ చీర ధరించి క్రికెట్ ఆడడం మీరు చూశారా? అలాంటి సాహసమే చేసింది భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. తాజాగా ప్రపంచంలోనే మొట్టమొదటి సారి చీరలో క్రికెట్ ఆడి భారతీయ వనితగా ఈ పనిచేసింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం ఫీవర్ మొదలైంది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అదే రోజున ఐసీసీ, టీ-20 మహిళల ప్రపంచకప్ లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మిథాలీ రాజ్ రూపొందించిన ఈ వీడియో అందరికీ ఆశ్చర్యపరిచింది. మిథాలీ ఎప్పుడూ కనిపించని చీరకట్టులో.. బొట్టు పెట్టుకొని క్రికెట్ ఆడటం ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. మహిళా దినోత్సవం రోజున ఏదైనా ప్రత్యేకంగా చేసి ప్రపంచానికి మీరేంటో చాటిచెప్పండి అంటూ మిథాలీ సందేశం ఇచ్చారు. మిథాలీ చీర కట్టుకొని క్రికెట్ షాట్లు కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోకు అద్భుత స్పందన వచ్చింది. చాలా మంది మెచ్చుకోగా.. ఒక తుంటరి మాత్రం చీర కట్టుకొని క్రికెట్ ఆడితే మిమ్మల్ని ఎవరూ బౌల్డ్ చేయలేరు అంటూ సరాదాగా చేసిన కామెంట్ కూడా ఆకట్టుకుంది.
Full View