పాటలతోనే సెన్సేషన్.. పెద్ది రికార్డ్స్ గ్యారెంటీ?
ముఖ్యంగా ఐపీఎల్ ఫీవర్‌కి ఈ పాట తోడవడంతో సోషల్ మీడియాలో 'పెద్ది' మేనియా వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూద్దాం ..;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ సైలెంట్‌గా ఉన్నారని ఫ్యాన్స్ కంగారు పడుతున్న వేళ, సెకండ్ సింగిల్ 'రై రై రా రా'తో ఒక్కసారిగా బాక్సాఫీస్ హీట్ పెంచేశారు. ఏఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్, చరణ్ డ్యాన్స్ మూమెంట్స్ చూస్తుంటే ఈ సినిమా రికార్డుల వేట మొదలైనట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ ఫీవర్‌కి ఈ పాట తోడవడంతో సోషల్ మీడియాలో 'పెద్ది' మేనియా వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూద్దాం ..
ఐపీఎల్ స్టేడియాల్లో 'రై రై రా రా' మోత:
ఈ సినిమాలోని రెండో పాట 'రై రై రా రా' కేవలం ఒక సాంగ్‌లా కాకుండా, ఇప్పుడు ఐపీఎల్ సీజన్‌కు ఒక అన్‌అఫీషియల్ యాంథమ్‌లా మారిపోయింది. హిందీ వెర్షన్‌లో ఈ పాట వింటుంటే వచ్చే ఎనర్జీ క్రికెట్ అభిమానులను ఊపేస్తోంది. ఇక ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ వంటి ఫ్రాంచైజీల ఫ్యాన్స్ ఈ పాటతో క్రేజీ ఎడిట్స్ చేస్తూ రీల్స్ షేర్ చేస్తున్నారు. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ చరణ్ షాట్‌ను రీక్రియేట్ చేస్తే, ఈసారి సాంగ్స్ ద్వారా 'పెద్ది' హిందీ బెల్ట్‌లో కూడా విపరీతమైన హైప్ తెచ్చుకుంటోంది. ఇక తెలుగులో 31 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ పాట, హిందీలో కూడా 10 మిలియన్ల మార్కును దాటేసి సినిమా రేంజ్ ఏంటో చెప్పకనే చెబుతోంది.
రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్.. చరణ్ క్లాస్ అండ్ మాస్ డ్యాన్స్:
బుచ్చిబాబు సనా మ్యూజిక్ విషయంలో ఎంత పక్కాగా ఉంటారో 'ఉప్పెన'తోనే ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు 'పెద్ది' కోసం ఏఆర్ రెహమాన్‌ను రంగంలోకి దింపి మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు. 'చికిరి చికిరి' పాట క్లాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తే, ఈ రెండో పాట మాస్ ప్రేక్షకులను థియేటర్లలో స్టెప్పులేయించేలా ఉంది. ఇక రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతున్నాయి. కేవలం పాటలతోనే సినిమాపై భారీగా అంచనాలు పెరగడం, సినిమా బిజినెస్‌కు కూడా పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఇక రెహమాన్ ఇచ్చిన థంపింగ్ స్కోర్ సినిమాలోని పల్లెటూరి యాక్షన్‌ను ఎలివేట్ చేయడంలో కీ రోల్ పోషించనుంది.
ఏప్రిల్ 30న అసలు సిసలైన ఊచకోత:
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి పవర్‌ఫుల్ స్టార్ కాస్టింగ్ ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమా హైప్ ను సెట్ చేసేశాయి. ఇక ఏప్రిల్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పక్కా లోకల్ కథని గ్లోబల్ లెవల్‌లో చూపిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. మొత్తానికి 'పెద్ది' సినిమా పాటలతోనే సగం విజయం సాధించేసింది. ఐపీఎల్ జోరుతో నార్త్ ఇండియాలో కూడా రామ్ చరణ్ క్రేజ్ మరో లెవల్‌కు వెళ్లడం ఖాయం అంటున్నారు ఫాన్స్ .