వీడియోః కష్టపడుతూ కసరత్తులు చేస్తున్న హాట్‌ బ్యూటీ

Update: 2021-01-08 11:49 GMT
Ajay - 7ఒకప్పుడు హీరోలు హీరోయిన్స్‌ ఫిజిక్‌ విషయంలో పెద్దగా దృష్టి పెట్టే వారు. ప్రస్తుతం యంగ్‌ హీరోలు ఫిజిక్ పై అత్యధికంగా దృష్టి పెడుతున్నారు. హీరోలతో పోటీ అన్నట్లుగా ఇప్పుడు హీరోయిన్స్ కూడా ఫిజిక్ విషయంలో దృష్టి పెడుతున్నారు. స్టార్‌ హీరోయిన్స్‌ వర్కౌట్‌ వీడియోలు సోషల్ మీడియాలో వరుసగా వైరల్‌ అవుతున్నాయి. ఆమద్య సమంత.. రకుల్‌.. తమన్నా అంతకు ముందు బాలీవుడ్‌ హీరోయిన్స్‌ వర్కౌట్‌ వీడియోలు సోషల్‌ మీడియాను చుట్టేశాయి. ఇప్పుడు మరోసారి కియారా అద్వానీ వీడియో వైరల్‌ అవుతోంది.

ఈ అమ్మడు చేస్తున్న వర్కౌట్‌ వీడియో ఆమె అందాన్ని మరింత అందంగా చూపిస్తుంది అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జిమ్‌ లో కష్టపడుతూ కసరత్తులు చేస్తున్న కియారా అందాల ప్రదర్శణ విషయంలో అదరగొట్టేసింది. తెలుగు లో రెండు సినిమాలు చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌ లో బిజీ అయ్యింది. అక్కడ స్టార్‌ హీరోల నుండి కుర్ర హీరోల వరకు ఈమె ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ గా మారిపోయింది. ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. దాంతో ఈ అమ్మడు ఫిజిక్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే ఇంతగా కష్టపడుతుంది.

Watch It Here:https://www.instagram.com/p/CJxu8ODn80c/?utm_source=ig_web_copy_link
Tags:    

Similar News