ప్రకాష్ రాజ్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన హేమా.. ఇప్పటికైనా?

విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్.. ఈ మధ్యకాలంలో కొంతమందిని ప్రత్యేకించి టార్గెట్ చేస్తూ ఇండైరెక్టుగా విమర్శలు గుప్పిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2026-06-05 06:00 GMT

విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్.. ఈ మధ్యకాలంలో కొంతమందిని ప్రత్యేకించి టార్గెట్ చేస్తూ ఇండైరెక్టుగా విమర్శలు గుప్పిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆయన చేసే వ్యాఖ్యల పట్ల కొంతమంది సెలబ్రిటీలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ.. ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడుతూ ట్వీట్ చేయగా.. ఇటు ప్రముఖ నటి హేమ కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ ప్రకాష్ రాజ్ పై అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె తన వీడియోలో.. "ప్రకాష్ రాజ్ గారు మీరు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన ట్వీట్ చూసాను. మనసు బాధపడింది. పవన్ కళ్యాణ్ గారిని దొర అని సంబోధించడం వెనుక మీ వెటకారం అర్థమవుతోంది. తెలంగాణ ప్రాంతంలో దొర అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడుతారో మీకు తెలియంది కాదు.

పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి తప్పులేదు.కూటమి ప్రభుత్వం విధానాలను, జనసేన నిర్ణయాలను కూడా విమర్శించండి.. తప్పులేదు.. కానీ వ్యక్తిగత హనణం చేయడానికి ప్రయత్నించకండి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాదిమంది ప్రజలకు బాగా తెలుసు. మీరు చదవరు కదా.. గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వారు ఏమైపోయారో చరిత్రలో చదవండి. మీకే అర్థమవుతుంది" అంటూ హేమ ప్రకాష్ రాజ్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది.

అసలు ఏమైంది అనే విషయానికి వస్తే.. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానని, స్వయంగా తానే ప్రజలలో తిరుగుతానని, రాబోయే ఎన్నికల్లో జనసేన తెలంగాణ నుండి పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ఇండైరెక్టుగా ట్వీట్ చేశారు." మీరు వస్తామంటే.. మేము వద్దంటామా.. రండి.. దొర.. రండి.. కానీ వచ్చేముందు పొత్తుతో వస్తున్నారా? సింగిల్ గా వస్తున్నారా? అనేది మాకు చెప్పి రండి" అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పైనే హేమ తనదైన శైలిలో ప్రకాష్ రాజ్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది.

అలాగే బండ్ల గణేష్ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చారు."ఒరేయ్.. నీకెందుకురా.. అసలు నువ్వు ఎవరివి. ప్రతి దాంట్లో వేలు పెట్టడానికి? మీ ఊరు ఏది? ప్రతి ఊర్లో ప్రతి సమస్యలో దూరి జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్ వా ? లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే.. ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా నువ్వే.. అసలు నీకెందుకు.. ముఖ్యంగా నీ చిరునామా ఏంటో నువ్వే తెలుసుకో.. ఆ తర్వాతే ప్రపంచాన్నే మార్చడానికి ప్రయత్నించు" అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ పై ఎప్పటికప్పుడు ఇండైరెక్టుగా కామెంట్లు చేస్తున్న ప్రకాష్ రాజ్ కి సెలబ్రిటీలు కూడా అంతే వేగంగా విమర్శలు గుప్పిస్తూ కౌంటర్ ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆయనలో మార్పు వస్తుందా? అసలు ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేస్తున్నారు? వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ ఉందా ? అనే కోణంలో నెటిజన్స్ చర్చిస్తున్నారు. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.




Tags:    

Similar News