మినీ డ్రెస్ లో మృణాల్ కొత్త లుక్.. హీటెక్కిస్తున్న బ్యూటీ!

ఒకవైపు సినిమా ప్రమోషన్స్ మరొకవైపు అందాల ఆరబోతతో అటు అభిమానులకు ఇటు ఫాలోవర్స్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అందాల తార మృణాల్ ఠాకూర్.

Update: 2026-06-05 05:33 GMT

ఒకవైపు సినిమా ప్రమోషన్స్ మరొకవైపు అందాల ఆరబోతతో అటు అభిమానులకు ఇటు ఫాలోవర్స్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అందాల తార మృణాల్ ఠాకూర్. అందం, అభినయంతో నటనతో ఆకట్టుకుంటూ ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఒకవైపు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె.. ఆ సినిమాల ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటూ సందడి చేస్తోంది.




 


అందులో భాగంగానే తాజాగా లేటెస్ట్ అవుట్ ఫిట్ తో నెటిజన్స్ ముందుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఈమె డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, పూజా హెగ్డే తో కలిసి నటిస్తున్న చిత్రం హై జవానీతో ఇష్క్ హోనా హై . ఈరోజు ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సందర్భంగా అటు ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొన్న ఈమె.. లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ఇంస్టాగ్రామ్ లో సెగలు పుట్టించింది. మినీ డ్రెస్ ధరించి అందాలతో హొయలు పోయింది. ముఖ్యంగా ఈ లుక్ లో ఆమె గ్లామర్ అందాలు చూసి యువత హీటెక్కిపోతున్నారు.



 


తాజాగా లేత గులాబీ రంగు తో డిజైన్ చేసిన ఎంబెలిష్డ్ మినీ డ్రెస్ ధరించింది. ఈ లుక్కును సిల్వర్ టోన్డ్ యాక్సెసరీస్ తో స్టైల్ చేశారు . ముఖ్యంగా విభిన్నమైన టెక్స్చర్ తో.. శరీరానికి అతుక్కుపోయే షోల్డర్ లెస్ మినీ డ్రెస్సును అత్యంత క్లిష్టమైన నెట్ తో చాలా క్లిష్టమైన అలంకరణలతో డిజైన్ చేశారు. సింగిల్ పీస్ మినీ డ్రెస్ ధరించిన ఈమె.. ఈ డ్రెస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే సిల్వర్, బ్లాక్ కలర్ తో డిజైన్ చేసిన ఓపెన్ టో శాండిల్స్ ను ధరించింది. చేతికి ఉంగరాలు, చెవులకు పింక్ వైట్ స్టోన్స్ తో డిజైన్ చేసిన చెవి దిద్దులు ధరించి సింపుల్ మేకప్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. మొత్తానికైతే మృణాల్ ఠాకూర్ ఈ లేటెస్ట్ పార్టీ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది.




 


ఇక మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈమె.. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తర్వాత చేసేది ఫ్యామిలీ స్టార్ సినిమా తో డిజాస్టర్ చవిచూసిన ఈమె.. ఇటీవల అడివి శేష్ తో కలిసి డెకాయిట్ సినిమాలో జూలియట్ పాత్రతో అభిమానుల హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించగా రమేష్ తౌరాణి నిర్మించారు.

Tags:    

Similar News