బాక్సాఫీస్ షేక్ చేసిన 'పెద్ది'.. తొలిరోజు వసూళ్లు ఎంతంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా, మొదటి రోజు కలెక్షన్లు ఆ అంచనాలకు తగ్గట్టు ఉండటం విశేషం.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, పాన్ ఇండియా వైడ్ గా సినిమా తొలి రోజు సుమారు రూ.69.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, గ్రాస్ కలెక్షన్లు రూ.82 కోట్లకు పైగా నమోదైనట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా పెద్దికి మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల నుంచే సాలిడ్ వసూళ్లు రావడంతో విదేశీ మార్కెట్లలోనూ సినిమా ఎఫెక్ట్ క్లియర్ గా కనిపించింది.
వరల్డ్ వైడ్ వసూళ్లు- రూ.135.36 కోట్లు (అఫీషియల్)
ఇండియా వైడ్ వసూళ్లు- రూ.82 కోట్లు గ్రాస్ (అంచనా)
తెలుగు రాష్ట్రాల వసూళ్లు- రూ.48 కోట్ల గ్రాస్ (అంచనా)
రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. ఆ రెండు రాష్ట్రాల నుంచి రూ.48 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ సినిమా సాలిడ్ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ లో విడుదలైన సెంటర్స్ లో ఆక్యుపెన్సీ పెరగడం మూవీ టీమ్ కు మరింత ఉత్సాహాన్నిచ్చింది.
టికెట్ బుకింగ్ ల పరంగా కూడా పెద్ది మంచి జోరు చూపించింది. తొలి రోజు ప్రీమియర్ షోలతో కలిపి మూడు మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. రెండో రోజు, వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ లు కూడా సాలిడ్ రేంజ్ లో ఉండటంతో రానున్న రోజుల్లో సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు ఇప్పుడు అంచనా వేస్తున్నారు.
ఇక పెద్ది కథ విషయానికొస్తే.. 1990ల కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే స్టోరీ ప్రేక్షకులను ఎమోషన్స్ కు దగ్గర చేస్తుంది. విజయనగరం జిల్లాలో గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న ఓ చిన్న గ్రామం చుట్టూ కథ తిరుగుతుంది. ఆ గ్రామానికి చెందిన యువకుడు పెద్ది పాత్రలో చరణ్ నటించారు. సాధారణ కూలీగా జీవనం సాగించే అతడు క్రీడలపై ఉన్న ఆసక్తితో ముందుకు సాగుతాడు. పరిస్థితుల కారణంగా తనకు ఇష్టమైన క్రికెట్ ను వదిలి మరో మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది.
ఆ తర్వాత అతని జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు, గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యం, క్రీడల ద్వారా తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల కథలో మెయిన్ ఎలిమెంట్స్. విలేజ్ ఎన్విరాన్మెంట్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏదేమైనా పెద్ది తొలిరోజు వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా కనిపించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్, వీకెండ్ బుకింగ్స్ లో కూడా జోరు కొనసాగితే పెద్ది చరణ్ కెరీర్‌లో మరో భారీ విజయంగా నిలుస్తుందనే చెప్పాలి.