షూటింగ్ తో పాటే అప్డేట్స్ కూడా మొద‌లు.. అనిల్ గేమ్ ప్లాన్ అదుర్స్

టాలీవుడ్ లో సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి రిలీజ‌య్యే వరకు ప్రేక్షకుల్లో ఆ సినిమా గురించి ఆసక్తిని పెంచ‌గ‌ల డైరెక్ట‌ర్ల లిస్ట్ లో అనిల్ రావిపూడి పేరు ముందు వరుసలో ఉంటుంది.

Update: 2026-06-05 06:33 GMT

టాలీవుడ్ లో సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి రిలీజ‌య్యే వరకు ప్రేక్షకుల్లో ఆ సినిమా గురించి ఆసక్తిని పెంచ‌గ‌ల డైరెక్ట‌ర్ల లిస్ట్ లో అనిల్ రావిపూడి పేరు ముందు వరుసలో ఉంటుంది. అనిల్ త‌న సినిమాల విష‌యంలో కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా, ప్రమోషన్స్ విషయంలోనూ ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తూ ఉంటారు. అలాంటి అనిల్ ఇప్పుడు మరోసారి తన స్టైల్‌ను చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనున్న భారీ మల్టీస్టారర్ సినిమా జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో చిత్రబృందం షూటింగ్‌కు సిద్ధమైంది. అంతేకాకుండా అనిల్ ఎప్ప‌టిలాగే ఈ సినిమాను కూడా సంక్రాంతి బరిలోకి తీసుకురావాలనే టార్గెట్ గా పెట్టుకుని, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అనిల్ రావిపూడి కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయన పని విధానం ఇతర డైరెక్ట‌ర్ల‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఒకసారి కథ, స్క్రీన్‌ప్లే, షూటింగ్ ప్లాన్ లాక్ అయితే ఇక వెనక్కి తిరిగి చూడడు. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారమే వేగంగా పనులు పూర్తి చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే నిర్మాతలు కూడా అనిల్‌తో పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా విషయంలోనూ అదే స్పీడ్ కనిపించబోతోందని తెలుస్తోంది.

ముఖ్యంగా జూన్ 22 నుంచి షూటింగ్ మొదలవుతుండటంతో పాటు, సినిమా యూనిట్ నుంచి వరుస అప్‌డేట్లు, సెట్స్ ఫొటోలు, వీడియోలు, ప్రత్యేక ప్రమోషనల్ కంటెంట్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో అప్పుడే చర్చ మొద‌లైంది. ఈ సినిమాను మొద‌లుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి షూటింగ్ పూర్తై, రిలీజ‌య్యే వరకు ప్రేక్షకుల దృష్టి ఎప్పుడూ ఈ ప్రాజెక్ట్‌పైనే ఉండేలా అనిల్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

ఇక అనిల్ రావిపూడి త‌న సినిమాల‌కు ప్ర‌మోష‌న్స్ కూడా చాలా ముందుగానే మొద‌లుపెడ‌తాడ‌నే విష‌యం తెలిసిందే. చాలా మంది డైరెక్ట‌ర్లు సినిమా రిలీజ్ టైమ్ దగ్గర ప‌డుతున్న‌ప్పుడే ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్ ను మొద‌లుపెడితే, అనిల్ మాత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఆ ప్రాజెక్టును చాలా స్పెష‌ల్ గా వార్తల్లో నిలబెడతాడు. సోషల్ మీడియా యుగంలో ఆడియ‌న్స్ దృష్టిని ఎలా ఆకర్షించాలో బాగా తెలిసిన డైరెక్ట‌ర్ గా అనిల్ కు మంచి పేరుంది. అందుకే జూన్ 22 నుంచి ఈ ప్రాజెక్ట్ చుట్టూ హడావిడి మొదలవుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్‌రామ్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిల్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కలవడంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెల‌కొన్నాయి. సంక్రాంతి 2027 రిలీజ్ అంటే, ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ, అనిల్ రావిపూడి తన ప్రచార వ్యూహాలతో ఇప్పటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమాపై నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో జూన్ 22తో ప్రారంభమయ్యే ఈ ప్రయాణం వచ్చే సంక్రాంతి వరకు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News