ముంబైలోనే హీరో పెళ్లి.. హాజరుకానున్న బాలీవుడ్ స్టార్స్!!
సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్ల సందడి జరుగుతూనే ఉంది. ఒకరి తర్వాత ఒకరు పెళ్లి కబుర్లు వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ తన చిరకాల ప్రేయసి నటాషా దలాల్‌ను ఈ నెల 24న పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొట్టేసాయి. సుమారుగా రెండేళ్ల నుండి వరుణ్ పెళ్లి వార్తలు బీటౌన్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. వరుణ్ ధావన్, నటాషా దలాల్ లవ్ లో ఉన్నారని, అతిత్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని ఇదివరకే కథనాలు వచ్చాయి. ఇక చూసిచూసి బోర్ కొట్టేసిందేమో.. ఈ మద్యే వరుణ్ తన ప్రేయసితో పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసాడు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన వరుణ్.. అన్నీ అనుకూలిస్తే ఈ 2021 లోనే తన ప్రేయసి నటాషా దలాల్‌ను పెళ్లి చేసుకుంటానని కన్ఫర్మ్ చేశాడు. అలాగే మంచి ముహూర్తం చూస్తున్నట్లు కూడా తెలిపాడు.
ఇక వరుణ్, నటాషాల వివాహ కార్యక్రమం ముంబైలోని అలీబాగ్‌లో పరిమిత కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుందట. అయితే తాజా సమాచారం ప్రకారం.. వరుణ్ ధావన్, నటాషా దలాల్ వివాహ వేడుకలు వియత్నాంలో గ్రాండ్ గా జరగాల్సి ఉందట. కాని మహమ్మారి కారణంగా వివాహ వెన్యూ ముంబైకి మార్చబడింది. సన్ సెట్ వెడ్డింగ్ అని పిలిచే వరుణ్, నటాషాల పెళ్లికి బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లతో పాటు పలువురు పాల్గొంటారని సమాచారం. ఇక జనవరి 26న ఈ నూతన దంపతులు తమ స్నేహితులు, సన్నిహితుల కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారట. మొత్తానికి బాలీవుడ్ లో ఓ కుర్రహీరో ఇంటివాడైపోతున్నాడు. ఇక వరుణ్ తన ప్రేయసి నటాషా గురించి మాట్లాడుతూ.. 'నటాషా నాకు చిన్ననాటి ఫ్రెండ్. కానీ తనను ప్రేమలో పడేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. ఎన్నిసార్లు లవ్ ప్రపోజ్ చేసినా నటాషా రిజెక్ట్ చేస్తుండేది. అయినా సరే వదలకుండా తన ప్రేమను గెలిచాను' అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు వరుణ్.