• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లేట్‌ అయినా మరో సూపర్...

లేట్‌ అయినా మరో సూపర్ స్టార్‌ ను పట్టిన వంశీ!!

By - Tupaki Desk
Update: 2021-05-23 15:30 GMT
2007 సంవత్సరంలో దర్శకుడిగా మున్నా సినిమాతో పరిచయం అయిన వంశీ పైడిపల్లి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి చొప్పున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. 2016 లో ఊపిరితో 2019లో మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వంశీ పైడిపల్లి తదుపరి సినిమా అదుగో ఇదుగో అంటూ ఇప్పటికే దాదాపుగా మూడేళ్లు పూర్తి అయ్యింది. మహర్షి తర్వాత వెంటనే మహేష్‌ బాబుతో సినిమాను చేసేందుకు గాను ప్రయత్నించాడు. కథ కూడా సిద్దం అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కలేదు.

ఇంత కాలం ఆలస్యం అయినా మరో సూపర్‌ స్టార్‌ తోనే వంశీ పైడిపల్లి సినిమాకు సిద్దం అవుతున్నాడు. తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ తో దిల్‌ రాజు సినిమా చేయబోతున్నాడు. తెలుగు మరియు తమిళంలో రూపొందబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. దర్శకుడు ఎవరు అనే విషయమై గత కొన్నాళ్లుగా చర్చలు జరిగాయి. పలువురు దర్శకులు చెప్పిన కథల్లో వంశీ పైడిపల్లి చెప్పిన కథకు విజయ్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వంశీ పైడిపల్లి గత సినిమాల నేపథ్యంలో ఆయనతో సినిమాను చేసేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ సమాచారం అందుతోంది.

ప్రస్తుతం విజయ్ 65వ సినిమా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందుతుంది. విజయ్ 66వ సినిమా ను లలిత్‌ కుమార్‌ నిర్మించబోతున్నాడు. ఆ సినిమా దర్శకుడు ఎవరు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఆ సినిమా తర్వాత దిల్‌ రాజు బ్యానర్‌ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 67వ సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తమిళ సూపర్‌ స్టార్‌ తెలుగులో సాలిడ్‌ మార్కెట్‌ ను క్రియేట్‌ చేసుకునేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Tags:    
  • Ilaya Thalapathy Vijay 
  • Vijay master Movie 
  • Kollywood 
  • Latest Movie Updates 
  • vamsi paidpally 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS