ఆంక్షలు విధించినా 'వకీల్ సాబ్'కు డోకా లేదట.. ఎలాగంటే??

Update: 2021-04-07 15:30 GMT
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు సామాన్యుల జీవితాలను కూడా కుదిపేస్తోంది. ఖచ్చితంగా ఈ మహమ్మారి దేశంలోని అన్నిరంగాల వారిని నష్టాలకు గురిచేస్తుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ దేశంలో లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండటం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి డేంజర్ పరిస్థితులలో అనేక రాష్ట్రాలలో లాక్డౌన్ తో కఠినమైన కరోనా నిబంధనలను కూడా అమలు చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు వీకెండ్స్ లో లాక్డౌన్ అలాగే నైట్ టైం కర్ఫ్యులను విధించడం జరిగింది. చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి నెలకొనేలా ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ ఎలా కట్టడి చేయాలో ప్రణాళిక చేస్తోంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి పలు మార్గదర్శకాలు చేయనున్నారట.

రేపు లేదా మరుసటి రోజున ఆ నిబంధనలు ఏమిటో మీడియా సమావేశంలో వెళ్లడిస్తారట. పరిస్థితి చూస్తే.. ఏప్రిల్ 15 నుండి తెలంగాణలో సినిమా థియేటర్స్ 50% అక్యూపెన్సీతో నడిపించే ఆలోచనలో ఉన్నట్లు టాక్. అదే జరిగితే ఏప్రిల్ నెలలో విడుదల కాబోయే సినిమాలపై చాలా ప్రభావం పడనుందని చెప్పవచ్చు. ఏప్రిల్ 16 శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ', ఏప్రిల్ 23న నేచురల్ స్టార్ నాని 'టక్ జగదీష్' సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. అలాగే ఏప్రిల్ 30న రానా విరాటపర్వం సినిమా రెడీగా ఉంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. లవ్ స్టోరీ, టక్ జగదీష్ సినిమాలు వాయిదాపడే అవకాశం ఉంది. కానీ ఏదేమైనా వకీల్ సాబ్ సినిమాకు మాత్రం ఎలాంటి డోకా లేదని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ అవుతోంది. అలాగే 50% సీటింగ్ సమయానికి కావాల్సిన వసూళ్లు రాబట్టుకుంటుంది. ఆ తర్వాత లవ్ స్టోరీ, టక్ జగదీశ్ సినిమాలు వాయిదాపడితే మరిన్ని రోజులపాటు వకీల్ సాబ్ విజయవంతంగా రన్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరగనుందో!
Tags:    

Similar News