స్టార్ బాయ్ సిద్దూ జాగ్రత్త పడుతున్నాడా?
టాలీవుడ్ యంగ్ హీరోస్ ఈ మధ్య కొత్త దారి వెతుక్కుటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు టైమ్ ఉండగానే ప్రత్యామ్నయ మార్గాలని ఎంచుకుంటున్నారు.;
టాలీవుడ్ యంగ్ హీరోస్ ఈ మధ్య కొత్త దారి వెతుక్కుటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు టైమ్ ఉండగానే ప్రత్యామ్నయ మార్గాలని ఎంచుకుంటున్నారు. `అందాల రాక్షసి` మూవీతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెరుస్తూ వస్తున్నాడు. అంతే కాకుండా ఓటీ ప్లాట్ ఫామ్‌లలోనూ సిరీస్‌లు, క్రైమ్ థ్రిల్లర్‌లు చేస్తూ లైమ్ లైట్‌లో ఉంటున్నాడు. ఇప్పుడు ఇదే పంథాని మిగతా యంగ్ హీరోలు కూడా ఫాలో అవుతున్నారు.
`సూపర్ సుబ్బు`తో సందీప్ కిషన్ ఓటీటీ బాటపడుతుండగా, ఆనంద్ దేవరకొండ `తక్షకుడు` మూవీతో డైరెక్ట్ ఓటీటీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి తరహాలోనే స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ కూడా జాగ్రత్త పడుతుననట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. `డీజే టిల్లు` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న సిద్దూ జొన్నలగడ్డ ఆ తరువాత `టిల్లూ స్క్వేర్`తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే `డీజే టిల్లు` స్థాయిలో మాత్రం ఆడియన్స్‌ని సంతృప్తి పరచలేకపోయాడు.
ఆ తరువాత చేసిన స్పై కామెడీ `జాక్`, రొమాంటిక్ డ్రామా `తెలుసు కదా` బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. ప్రస్తుతం మరో క్రేజీ మూవీ చేస్తున్నా మళ్లీ టిల్లూ ఫ్రాంఛైజీనే నమ్ముకున్నాడు. `టిల్లూ క్యూబ్` అనే టైటిల్‌తో మరో సినిమాకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నాడు. దీనికి ముందు ఓ వెబ్ సిరీస్‌ని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కోసం సరికొత్త కథతో ఓ వెబ్ సిరీస్ రూపొందబోతోంది. దీనికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నాడు.
ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ని నెట్ ఫ్లిక్స్ వర్గాలు ప్రకటించనున్నాయి. ఇది సిద్దూ నటించే తొలి వెబ్ సిరీస్ కావడం గమనార్హం. దీంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ బాయ్ అక్కడ సక్సెస్ అయితే మరిన్ని సిరీస్‌లు చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇక్కడ జీరో అయితే అక్కడ హీరో కావచ్చని ఇప్పటి వరకు నవీన్ చంద్ర లాంటి హీరోలు నిరూపించడంతో సిద్దూ జొన్నలగడ్డ ఆ వైపుగా అడుగులు వేస్తున్నాడట.
ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డ `బదాస్` మూవీ చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి రవికాంత్ పేరుపు దర్శకుడు. ఇక డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా ఓ బారీ మూవీని రూపొందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి `విశ్వనాథం అండ్ సన్స్` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుఈ మూవీలోని కీలక పాత్రల్లో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సమ్మర్‌కు రిలీజ్ కానుంది.