చిన్న సినిమాకు అదిరిపోయే క‌లెక్ష‌న్లు

టాలీవుడ్‌లో కంటెంట్ ఆధారిత ప్రేమ కథలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఆ జాబితాలో తాజాగా చేరిన చిత్రం కపుల్ ఫ్రెండ్లీ.;

Update: 2026-02-17 11:52 GMT

టాలీవుడ్‌లో కంటెంట్ ఆధారిత ప్రేమ కథలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఆ జాబితాలో తాజాగా చేరిన చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. రిలీజైన మొద‌టి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 5.42 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించడం ద్వారా ఈ సినిమా తన సత్తాను చాటుకుంది. ఒక చిన్న సినిమాకు రూ.5.42 కోట్ల గ్రాస్ అంటే చిన్న విష‌య‌మేమీ కాదు.



 


క‌పుల్ ఫ్రెండ్లీకి సెల‌బ్రిటీల ప్ర‌శంస‌లు

ఈ మూవీలో సెన్సిటివ్ ల‌వ్ స్టోరీని ఆధునిక సంబంధాల నేపథ్యంలో చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా థియేటర్లకు రప్పించడంలో కపుల్ ఫ్రెండ్లీ విజయవంతమైంది. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్, నేచుర‌ల్ యాక్టింగ్, మ్యూజిక్..ఇవ‌న్నీ సినిమాకు బ‌లంగా నిల‌వ‌గా, ఈ మూవీకి ఇండ‌స్ట్రీలోకి ప‌లువురు ప్ర‌ముఖులు సైతం ప్ర‌శంస‌లు కురింపించ‌డం విశేషం.

ప్ర‌భాస్ ప్ర‌శంస‌లందుకున్న క‌పుల్ ఫ్రెండ్లీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ లాంటి సెల‌బ్రిటీలు క‌పుల్ ఫ్రెండ్ టీమ్‌ను అభినందించడం ఈ మూవీకి మ‌రింత బ‌జ్ ను తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించగా, అజ‌య్ కుమార్ రాజు కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు.

ప్ర‌మోష‌న్స్ విష‌యంలో ధీర‌జ్ దూకుడు

అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ ధీర‌జ్ మొగిలినేని రిలీజ్ చేశారు. కంటెంట్ పై న‌మ్మ‌క‌ముంచి స‌రైన సినిమాల‌ను సెలెక్ట్ చేసుకుని రిలీజ్ చేయ‌డం ఆయ‌న స్పెషాలిటీ. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో క‌పుల్ ఫ్రెండ్లీ సినిమాను విస్తృత స్థాయిలో రిలీజ్ చేసి మంచి ఓపెనింగ్స్ సాధించడంలో కీల‌క పాత్ర పోషించారు. ప్ర‌మోష‌న్స్ విష‌యంలో కూడా ఆయ‌న దూకుడు స్ప‌ష్టంగా క‌నిపించింది.

చిత్ర యూనిట్ తో క‌లిసి నిర్వ‌హించిన ప్ర‌మోష‌న‌ల్ టూర్ కు ఆడియ‌న్స్ లో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకోవ‌డం, సోష‌ల్ మీడియాలో సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుకోవ‌డం, ప్ర‌భాస్ లాంటి సెల‌బ్రిటీల ప్ర‌శంస‌లు.. ఇవ‌న్నీ క‌పుల్ ఫ్రెండ్లీ సినిమాను క‌మ‌ర్షియ‌ల్ గా లాభాల దిశ‌కు తీసుకెళ్తున్నాయి.చూస్తుంటే రానున్న రోజుల్లో క‌పుల్ ఫ్రెండ్లీ మ‌రింత మెరుగైన క‌లెక్ష‌న్లు సాధించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

Tags:    

Similar News