ఆ అనుభ‌వం ఇప్పుడు ప‌నికొచ్చింది

వరుస ప్రయోగాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు సుహాస్‌ ఇప్పుడు పూర్తి స్థాయి వినోదాత్మక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.;

Update: 2026-02-17 11:49 GMT

వరుస ప్రయోగాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు సుహాస్‌ ఇప్పుడు పూర్తి స్థాయి వినోదాత్మక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం హే బల్‌వంత్‌ ఫిబ్రవరి 20న విడుదలకు సిద్ధమవుతోంది. మొదట హే భగవాన్‌ పేరుతో ప్రారంభమైన ఈ సినిమాకి సెన్సార్‌ సూచనల మేరకు టైటిల్‌ను మార్చారు. భగవాన్‌ అనే పదానికి ధార్మిక అర్థం వచ్చే అవకాశం ఉందని భావించి, కథా కాన్సెప్ట్‌ను పరిగణనలోకి తీసుకుని హే భ‌గ‌వంత్ గా డిసైడ్ చేసిన‌ట్టు సుహాస్‌ తెలిపారు. చిత్ర ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న సుహాజ్ తాజాగా మీడియా ముందుకొచ్చి ఈ సినిమా గురించి, త‌న నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు.

సుహాస్ కెరీర్లోనే ఫాస్ట్ గా పూర్తైన సినిమా

గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి నిర్మించారు. బన్నీ వాస్‌, వంశీ నందిపాటి కలిసి సమర్పిస్తున్న ఈ సినిమాలో శివానీ నగరం హీరోయిన్‌గా నటించగా, సీనియర్‌ నటుడు నరేష్‌, యాంకర్‌ స్రవంతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూర్తి స్థాయి అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ తన కెరీర్‌లోనే ఫాస్ట్ గా పూర్తైన సినిమా అని సుహాస్‌ వెల్లడించారు.

ఊహించిన దానికంటే వంద రెట్లు బాగొచ్చింది

చిన్నప్పటి నుంచే బిజినెస్‌ చేయాలని కలలు కనే ఓ యువకుడి కథే ఈ సినిమా అని, తండ్రి వ్యాపారాన్ని టేక‌పే చేయ‌డానికి ప్ర‌య‌త్నించే సమయంలో ఎదురయ్యే సంఘటనలే క‌థ‌కు మూలంగా ఉంటాయ‌ని, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోష‌న్స్ కు కూడా చోటు ఇచ్చిన ఈ కథ త‌న‌ను వెంటనే ఆకట్టుకుందని సుహాస్‌ అన్నారు. సినిమా తాము ఊహించిన దానికంటే వంద రెట్లు బాగా వ‌చ్చింద‌ని, ఈ సినిమా త‌న‌కు స‌క్సెస్ ను అందిస్తుందని న‌మ్ముతున్న‌ట్టు సుహాస్ చెప్పారు.

ఫెయిల్యూర్స్ త‌ర్వాత కొంత గ్యాప్

రీసెంట్ గా వరుస స‌క్సెస్‌లు అందుకోలేకపోయినప్పటికీ, ప్రతి సినిమాకీ తన శక్తిమేర ప్రయత్నిస్తానని, రిజ‌ల్ట్ కోసం ఓపికగా ఎదురుచూస్తానని సుహాస్‌ చెప్పారు. వరుస ఫెయిల్యూర్స్‌ తరువాత కొంత గ్యాప్ తీసుకుని, కంట్రోల్‌గా ఆలోచించి మంచి కథను ఎంచుకున్నానని, తన భార్య కూడా ఈ సినిమా చూసి ఎంతో ఎంజాయ్‌ చేసి, ఇలాంటి పాత్రలే చేయాలని ప్రోత్సహించిందని చెప్పారు.

త‌మిళంలో విల‌న్ గా సినిమాలు

ఇప్పటివరకు ప్రధానంగా సీరియస్‌ పాత్రల్లో కనిపించిన సుహాస్‌ ఈ చిత్రంలో కామెడీ పాత్ర‌లో క‌నిపించ‌గా, కెరీర్ స్టార్టింగ్ లో చేసిన షార్ట్‌ఫిల్మ్స్ లోని కామెడీ పాత్రల‌ అనుభవం ఇప్పుడు ఉపయోగపడిందన్నారు. ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల గురించి చెప్తూ, తమిళంలో మందాడి అనే సినిమాలో మెయిన్ విల‌న్ గా న‌టిస్తున్నాన‌ని, ఆ సినిమాలో భిన్నమైన లుక్‌తో ఆడియ‌న్స్ ను అల‌రించ‌నున్నానని, అలాగే కార్తీక్‌ సుబ్బరాజ్‌ బ్యానర్‌లో మరో ప్రాజెక్ట్‌ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి, హే బల్‌వంత్ మూవీ త‌న కెరీర్ ను కొత్త మ‌లుపు తిప్పుతుంద‌ని సుహాస్ ఆశిస్తున్నారు. మ‌రి ఈ మూవీ ఆడియ‌న్స్ ను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News