• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాన్సిక చేసుకోబోయే పర్సన్...

హాన్సిక చేసుకోబోయే పర్సన్ ఎవరో తెలుసా..?

By - Tupaki Desk
Update: 2022-11-02 05:04 GMT
సౌత్ స్టార్ హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్ కి రెడీ అయింది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన మార్క్ చూపించి ఎన్నో లక్షల మంది అభిమానూలను సంపాదించిన హాన్సిక స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు కెరియర్ లో పెద్దగా జోష్ లేకపోయే సరికి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది.

డిసెంబర్ 4న హాన్సిక మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. జైపూర్ లోని ఓ ప్యాలెస్ ని కూడా హాన్సిక మ్యారేజ్ కోసం బుక్ చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు అమ్మడు పెళ్లి చేసుకునేది ఎవరిని అన్నది సస్పెన్స్ కొనసాగుతుంది. వరుడి వివరాలేవి బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అయితే వారెంత దాచినా సరే హాన్సిక చేసుకోబోయే వ్యక్తి ఎవరన్నది రివీల్ అయ్యింది.    

హాన్సిక చేసుకునేది అరేంజ్డ్ మ్యారేజా.. లేక లవ్ మ్యారేజా అంటే.. లవ్ కమ్అరేంజ్డ్ అని తెలుస్తుంది. తనతో పాటు తన బిజినెస్ లో ట్రావెల్ చేస్తున్న తన స్నేహితుడినే పెళ్లి చేసుకుంటుంది హాన్సిక. ఇంతకీ హాన్సిక మనసు గెలిచిన అతగాడి పేరు ఏంటి అంటే సోహైల్ కథురియా అని తెలుస్తుంది. హాన్సిక తో పాటుగా పలు బిజినెస్ లలో పార్ట్ నర్ అయిన సోహైల్ తో కొన్నాళ్లుగా అమ్మడు సీరియస్ లవ్ లో ఉన్నట్టు సమాచారం. ఇన్నాళ్లు సీక్రెట్ గా నడిపించగా పెళ్లితో అందరికి షాక్ ఇవ్వబోతుంది హాన్సిక.     

తెలుగులో కేవలం ఐదారు సినిమాలతోనే సరిపెట్టుకున్న హాన్సిక కోలీవుడ్ లో మాత్రం పాతిక సినిమాల దాకా చేసింది. అక్కడ అమ్మడికి స్టార్ స్టేటస్ కట్టబెట్టారు. తమిళ హీరో శింబుతో కూడా లవ్ ట్రాక్ నడిపిందని అన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇదంతా ఒకప్పటి మ్యాటర్ ఇప్పుడు హాన్సిక మ్యారేజ్ తో కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతుంది. హాన్సిక మ్యారేజ్ కూడా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరగనుందట. సెలబ్రిటీస్ కి ఎవరికీ తన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇవ్వలేదట.

కేవలం ఫ్యామిలీ సమక్షంలోనే హాన్సిక మ్యారేజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటన్నది తెలియదు కానీ తమ అభిమాన నటి పెళ్లి వార్త విని సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హాన్సిక ఫ్యాన్స్. ప్రస్తుతం హాన్సిక 105, మై నేమ్ ఈజ్ శృతి, పార్ట్ నర్ సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇవే కాకుండా మరో నాలుగు సినిమాల్లో నటిస్తుంది హాన్సిక. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగించాలని చూస్తుంది అమ్మడు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TollywoodActress 
  • ActressHansikaMotwani 
  • HasikaMarriageinJaipurPalace 
  • SohailKathuria 
  • HansikaMarriage 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS