నితిన్‌ పెళ్లి విషయమై ఫ్యామిలీ స్పందన

Update: 2020-03-16 07:00 GMT
కరోనా ఎఫెక్ట్‌ దాదాపుగా అందరిపై కనిపిస్తుంది. ముఖ్యంగా సెలబ్రెటీలు అనేక విధాలుగా కరోనా వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యంగ్‌ హీరో నితిన్‌ తన పెళ్లి విషయమై ఎటూ త్చేుకోలేక పోతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం వచ్చే నెలలో 15వ తారీకున దుబాయిలో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేయాలనుకున్నారు. కాని కరోనా వల్ల దేశ విదేశాల్లో కూడా ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వివాహం అంటే చాలా రిస్క్‌ తో కూడుకున్న విషయంగా అంతా భావిస్తున్నారు.

నితిన్‌ పెళ్లి గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు స్పందించారు. నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి స్పందిస్తూ... పెళ్లి విషయంలో ప్రస్తుతం సందిగ్దంలో ఉన్నాం. ఇంకా సమయం ఉన్న కారణంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పెళ్లి అదే రోజు చేయాలా లేదంటే మరో రోజుకు వాయిదా వేయాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోలేదు. మా ముందు పలు ఆప్షన్స్‌ ఉన్నాయి. త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని ఆయన అన్నాడు.

సోదరుడి వివాహం పై నికితా రెడ్డి స్పందిస్తూ.. పెళ్లి విషయంలో కుటుంబం అంతా చర్చిస్తున్నాం. వాయిదా వేసే ఆలోచన ప్రస్తుతానికి లేదు కాని త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేయడం మంచిదని అనుకుంటున్నారు. కాని పెళ్లి వాయిదా వేస్తే మళ్లీ ఎప్పటికి పరిస్థితులు అదుపులోకి వచ్చేనో తెలియదు. అందుకే పెళ్లిని వాయిదా వేయకుండా సింపుల్‌ గా నిర్వహించాలని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. కుటుంబ సభ్యులు చర్చించి నితిన్‌ పెళ్లి విషయమై ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అయితే ఇప్పటి వరకు నితిన్‌ నుండి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.
Tags:    

Similar News