'ధురంధ‌ర్‌' పై కింగ్ షాకింగ్ కామెంట్స్‌!

అయితే ఈ నేప‌థ్యంలోనే ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ నాగార్జున లేటెస్ట్ సెన్సేష‌న్ 'ధురంధ‌ర్‌' మూవీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.;

Update: 2026-02-16 06:32 GMT

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'ధురంధ‌ర్‌' దేశ వ్యాప్తంగా ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సైలెంట్‌గా విడుద‌లైన రికార్డు స్థాయి విజ‌యాన్ని సాధించింది. ఇండియ‌న్ రా ఏజెంట్ దేశం కోసం దాయాది దేశం పాక్‌లో ఉంటూ ఎలా గూఢ‌చ‌ర్యం చేశాడు? ..ఎలా గ్యాంగ్‌స్ట‌ర్ల‌ని అడ్డంపెట్టుకుని పాక్ చేస్తున్న అరాచ‌కాల‌పై తిరుగుబాటు చేశాడ‌నే ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీతో..అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన రియ‌ల్ ఇన్సిడెంట్స్ నేప‌థ్యంలో చేసిన 'ధురంధ‌ర్‌' దేశ రాజ‌కీయాల్లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా నిలిచింది.

సైలెంట్‌గా విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల ప‌రంగా రికార్డుల్నితిర‌గ‌రాస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.1345 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ సెల‌బ్రిటీస్‌ని విస్మ‌యానికి గురి చేసింది. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు తెర‌లేపిన ఈ మూవీపై కింగ్‌ నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశారు. కీల‌క పాత్ర‌ల‌కు కూడా ఈ మ‌ధ్య గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్న కింగ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'కూలీ'లో కీల‌క విల‌న్ సీమ‌న్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. నాగార్జున అభిమానుల్ని నిరాశ‌ప‌రిచినా నాగ్ న‌ట‌న‌కు మాత్రం మార్కులు ప‌డ్డాయి.

అయితే ఈ నేప‌థ్యంలోనే ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ నాగార్జున లేటెస్ట్ సెన్సేష‌న్ 'ధురంధ‌ర్‌' మూవీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ మూవీలో అక్ష‌య్ ఖ‌న్నా రెహ‌మాన్ డ‌కాయిత్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిల‌వ‌డం తెలిసిందే. ఇదే క్యారెక్ట‌ర్ కోసం ముందు టీమ్ నాగార్జున‌ని సంప్ర‌దించార‌ని, అయితే ఆయ‌న `కూలీ` మూవీ కార‌ణంగా ఈ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించార‌ని వార్త‌లొచ్చాయి. అంతే కాకుండా ఇలాంటి ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌ని తిర‌స్క‌రించి నాగ్ త‌ప్పు చేశార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది.

తాజాగా దీనిపై నాగార్జున స్పందించారు. త‌న‌ని ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌న్నారు. 'ధురంధ‌ర్‌' సూప‌ర్ మూవీ. ఆదిత్య‌ధ‌ర్ అద్భుతంగా సినిమాని రూపొందించారు. ఆయ‌న తీసిన 'ఉరి ది సర్జిక‌ల్ స్ట్రైక్స్' మూవీ కూడా ఇష్ట‌మే. 'ధురంధ‌ర్‌'లో అంద‌రూ చాలా చ‌క్క‌గా న‌టించారు. అక్ష‌య్ ఖ‌న్నా న‌ట‌న సినిమాకే హైలైట్. సీక్వెల్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా. అది కూడా విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షిస్తున్నా' అని తెలిపారు. ఇదే సంద‌ర్భంగా త‌న వంద‌వ సినిమా గురించి కూడా స్పందించారు. దీని కోసం మేము తొంద‌ర ప‌డ‌టం లేద‌న్నారు.

సినిమా ఫాస్ట్‌గా పూర్తి చేయాల‌న్న ఆలోచ‌న లేదు. దాన్ని ప్ర‌త్యేక మూవీగా తీర్చిదిద్దాల‌నుకుంటున్నాం. 'ధురంధ‌ర్‌' చూసిన త‌రువాత ఒక విష‌య‌మైతే అర్థ‌మైంది. ప్రేక్ష‌కులు అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తీసిన క‌థ‌ల‌ను చూసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు` అని చెప్పుకొచ్చారు. కింగ్ నాగార్జున త‌న 100వ సినిమా కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. దీన్ని ఏదో ఆషామాషీ మూవీగా కాకుండా చాలా ప్ర‌త్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. `ధురంధ‌ర్‌` త‌రువాత త‌న ఆలోచ‌న మారిందంటున్న కింగ్ ఎలాంటి స్టైల్లో త‌న 100వ సినిమాని తెర‌పైకి తీసుకొస్తారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News