• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ 152లో ఊహించ‌ని...

మెగాస్టార్ 152లో ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ స్టార్

By - Tupaki Desk
Update: 2019-11-08 06:38 GMT
మెగా స్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడి గా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం లో సోషియో పొలిటిక‌ల్ డ్రామా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ నుంచి సెట్స్ కెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు స‌హా కాస్టింగ్ సెల‌క్ష‌న్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే అజ‌య్ - అతుల్ ద్వ‌యం సంగీతం అందిస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అలాగే ఈ చిత్రంలో ఒక క‌థానాయిక‌ గా త్రిష‌ను ఫైన‌ల్ చేశార‌ని గ‌త కొంత‌కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక ఈ చిత్రంలో ఇద్ద‌రు క‌థానాయిక‌లకు స్కోప్ ఉంది. రెండో నాయిక కోసం కొర‌టాల క‌స‌ర‌త్తు చాలా సీరియ‌స్ గా సాగుతోంద‌ట‌. చిరు ఇమేజ్ కి త‌గ్గ క‌థా నాయిక‌లు అంటే న‌య‌న‌తార‌.. కాజ‌ల్.. త‌మ‌న్నా ఆ రేంజు వారినే ప‌రిశీలించాల్సి వ‌స్తోంది. అయితే వీళ్ల‌లో ఎవ‌రినీ రిపీట్ చేసే ఆలోచ‌న కొర‌టాల‌కు లేద‌ట‌. న‌య‌న్ - త‌మ‌న్నా ఇటీవ‌లే సైరా-న‌ర‌సింహా రెడ్డి చిత్రంలో క‌నిపించారు. కాజ‌ల్ అంత‌కుముందే ఖైదీనంబ‌ర్ 150లో న‌టించింది. అందుకే వీళ్ల‌లో ఎవ‌రినీ కాకుండా మ‌రో కొత్త స్టార్ కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. పైగా ఆ స్టార్ ఇమేజ్ పైన చెప్పిన ఆ మూడు పేర్ల స్థాయిలో ఉండాల‌న్న ప్లాన్ ఉంద‌ట‌.

అయితే వెత‌క‌ బోయిన తీగ కాలికి త‌గిలిన‌ట్టు ... బొమ్మ‌రిల్లు హాసిని అయితే బావుంటుంద‌ని కొణిదెల బృందం భావిస్తోంద‌ట‌. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కొర‌టాల‌-చ‌ర‌ణ్ ఇప్ప‌టికే జెనీలియాని సంప్ర‌దించే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది. ఆ రెండో పాత్ర‌లో చిలిపిద‌నం.. కొంటెత‌నానికి త‌గ్గ‌ట్టే జెనీలియా ఇమేజ్ కి ఆ పాత్ర స‌రిపోతుంద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ ఇద నిజ‌మైతే హానిని ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లాడి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మామ్ అయిన జెనీలియా స‌రైన రీఎంట్రీ కోసం చాలా కాలంగానే వేచి చూస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఏకంగా మెగా ఆఫ‌ర్ త‌న‌ని వెతుక్కుంటూ వెళుతోంది అంటే అది ల‌క్కీ అనే చెప్పాలి. అట్నుంచి ఎలాంటి స‌మాధానం రానుంది అన్న‌ది చూడాలి. 2016 లో `ఫోర్ట్ 2` చిత్రంలో న‌టించిన జెనీలియా.. 2018లో హ‌బ్బీ రితేష్ స‌ర‌స‌న మౌళి అనే మ‌రాఠా చిత్రంలో న‌టించింది.
Tags:    
  • Chiru 152 
  • Genelia 
  • Koratala Shiva 
  • Ram Charan 
  • Tollywood News 
  • Tollywood Latest Updates 
  • Chiru 152 Heroine 
  • Tupaki News 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS