• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శివ కార్తికేయన్ కోసం...

శివ కార్తికేయన్ కోసం ఉక్రెనియన్ బ్యూటీని దింపిన జాతిరత్నం..!

By - Tupaki Desk
Update: 2022-03-21 13:36 GMT
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ శివకార్తికేయన్ #SK20 చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'జాతి రత్నాలు' చిత్రంతో బ్లాక్‌ బస్టర్ విజయం సాధించిన అనుదీప్.. 'వరుణ్ డాక్టర్' సక్సెస్ జోష్ లో ఉన్న శివకార్తికేయన్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్‌ ను సిద్ధం చేశాడని తెలుస్తోంది.

ఇటీవలే #SK20 మూవీ సెట్స్ మీదకు వెళ్లగా.. తాజాగా మేకర్స్ సినిమాలో హీరోయిన్‌ ని ప్రకటించారు. ఇందులో హీరోయిన్ గా ఉక్రేనియన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా ఎంపికైంది. ఇంతకుముందు రెండు ఉక్రేనియన్ సినిమాల్లో నటించిన మారియా.. ప్రసిద్ధ భారతీయ వెబ్-సిరీస్ 'స్పెషల్ ఆప్స్‌' లో కీలక పాత్ర పోషించింది.

ఈ క్రమంలో ఇప్పుడు శివ కార్తికేయన్ కు జోడీగా కనిపించబోతోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో మరియా ర్యాబోషప్కా చాలా అందంగా కనిపిస్తోంది. #SK20 విభిన్నమైన కాన్సెప్ట్‌ తో కూడిన వినోదభరితమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని ప్రచారం చేయబడుతోంది.

ఇది తెలుగు మరియు తమిళంలో రూపొందే ద్విభాషా చిత్రం. భారతదేశంలోని పాండిచ్చేరి మరియు యూకేలోని లండన్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. ఇందులో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి - సురేష్ ప్రొడక్షన్స్ మరియు శాంతి టాకీస్ బ్యానర్‌లపై రూపొందిస్తున్నారు.

నారాయణ్ దాస్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు మరియు సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే #SK20 చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.
Tags:    
  • Shiva Karthikeyan 
  • Maria Raboshapka 
  • SK20 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS