• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మధుర శ్రీధర్, టీవీ9...

మధుర శ్రీధర్, టీవీ9 సమర్పించు..

By - Tupaki Desk
Update: 2015-09-08 22:53 GMT
మధుర శ్రీధర్ ది మంచి బిజినెస్ బుర్ర అని కొత్తగా చెప్పాల్సిన  పని లేదు. నేరుగా డైరెక్టర్ కావడం కష్టమని.. ముందుగా ఆడియో సంస్థతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత దర్శకుడిగా లో బడ్జెట్ లో మంచి సినిమాలు తీశాడు. ఆపై టాలెంటెడ్ డైరెక్టర్ లతో చిన్న సినిమాలు నిర్మిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ఈ మధ్య మధుర శ్రీధర్ నిర్మించిన రెండు సినిమాలు ఇండస్ట్రీపై ఓ ప్రత్యేకమైన ముద్ర వేశాయి. నీలకంఠతో చేసిన ‘మాయ’, మంజునాథ్ అనే యువ దర్శకుడితో చేసిన ‘లేడీస్ అండ్ జెంటిల్ మన్’ కమర్షియల్ గా అంత సక్సెస్ కాకున్నా.. శ్రీధర్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మాయ సినిమాను మహేష్ భట్ లాంటి పెద్ద నిర్మాతతో హిందీలో రీమేక్ చేయిస్తున్న శ్రీధర్.. లేడీస్ అండ్ జెంటిల్మన్ సినిమా శాటిలైట్ రైట్స్ ను మంచి రేటుకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు.

సినిమాను ఎలా మార్కెట్ చేసుకోవాలో శ్రీధర్ ని చూసే తెలుసుకోవాలనడానికి ఈ రెండు సినిమాలు ఉదాహరణ. మధుర శ్రీధర్ ఇప్పుడు మరో ఆసక్తికర కాంబినేషన్ కు శ్రీకారం చుడుతున్నాడు. ప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ9తో కలిసి సినిమాలు నిర్మించడానికి రంగం సిద్ధం చేశాడు. తొలి ప్రయత్నంగా రామరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రామరాజు మరెవరో కాదు. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పూవు’ అనే అచ్చతెలుగు అందమైన సినిమాను అందించిన దర్శకుడు. తొలి సినిమాతోనే మంచి టేస్టుందని రుజువు చేసుకున్న రామరాజుకు మధుర శ్రీధర్ అవకాశమిస్తున్నాడు. ఇది కూడా ఓ అందమైన లవ్ స్టోరీ అని చెబుతున్నారు. జ్యోతిలక్ష్మి హీరో సత్య ఇందులో కథానాయకుడి పాత్ర పోషించబోతున్నాడు. హీరోయిన్ ఇంకా ఫిక్సవలేదు. టీవీ9 లాంటి పెద్ద ఛానెల్ ను తనతో కలిసి సినిమా నిర్మించడానికి ఒప్పించాడంటే శ్రీధర్ మామూలోడు  కాదు. ఈ కాంబినేషన్ ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.
Tags:    
  • Madhura Sridhar 
  • TV9 
  • Telugu NEws 

Similar News

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS