సోషల్ మీడియా ట్రోల్స్ పై మెగాస్టార్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడా...?

Update: 2020-04-21 21:30 GMT
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఒకేసారి చిరంజీవి ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. రోజు రోజుకు చిరంజీవిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. సోషల్ మీడియా మన డైలీ లైఫ్ లో భాగమైపోవడంతో సెలెబ్రెటీలు కూడా తమ ఫ్యాన్స్ కి టచ్ లో ఉండటానికి సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా వారు పెట్టే పోస్ట్ ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు. టాప్ స్టార్స్ లో చాలా తక్కువ మంది మాత్రమే రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ ఉంటారు. కొందరు అయితే వారానికి ఒకటి నెలకు ఒకటి అన్నట్లుగా పోస్ట్ లు పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఏ రకంగా తన జర్నీని కొనసాగిస్తాడో అని అంతా అనుకున్నారు. చిరంజీవి కూడా పెద్దగా పోస్ట్స్ చేయకపోవచ్చు అనుకున్నారు. కానీ మెగాస్టార్ మాత్రం ఎంట్రీ ఇచ్చిన రోజు నుండి వరుసగా పోస్ట్ లు పెడుతూనే ఉన్నాడు.

అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎంటర్ అవడం పెద్ద సమస్య కాదు కానీ అక్కడ ఎలా మెలగాలో అందరికీ తెలీదు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ట్విట్టర్, పేస్ బుక్ వాడకంలో ఇబ్బందులు పడుతుంటారు. వీరందరూ సోషల్ మీడియా ట్రోల్స్ కి బలవుతుంటారు. సోషల్ మీడియాలో మన అభిప్రాయాలను అందరూ గౌరవించాలని లేదు. ఒక్కొక్కసారి మనం పెట్టే పోస్ట్ నచ్చని వాళ్ళు ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. అలాంటిది మెగాస్టార్ ఆ ట్రోల్స్ ఎలా తట్టుకొని నిలబడతాడనే అనుమానం అందరి మదిలో మెదిలింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ పై స్పందించిన మెగాస్టార్ 'నన్ను ఎవరూ నా అనుమతి లేకుండా బాధపెట్టలేరు. ఒకవేళ వారు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా అది వారి క్యారక్టర్ తెలియజేస్తుందే తప్ప తనకు మనశాంతిని దూరం చేయలేదని.. తన క్యారెక్టర్ ని దెబ్బ తీయలేవని' చెప్పుకొచ్చాడట.

దీనిని బట్టి చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా మీద మంచి అవగాహనతోనే అడుగు పెట్టినాడని ఇట్టే అర్థమైపోతుంది. ట్రోల్స్ ని ఎలా స్వీకరించాలో తనకున్న అనుభవంతో తెలుసుకొని మెలుగుతున్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఏదేమైనా తమ అభిమాన హీరో మెగాస్టార్ ఎప్పుడూ ఇలా సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండటం ఫ్యాన్స్ ని చాలా సంతోష పెడుతున్నది. ఇదిలా ఉండగా చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా కష్టాల్లో ఉన్న సినీ కార్మికుల కుటుంబాలను ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఛారిటీ ద్వారా వారికి నిత్యావసర వస్తువులను అందజేస్తూ వారి జీవితాలకు భరోసా కలిగిస్తున్నాడు.


Tags:    

Similar News