త్రివిక్రమ్ జ్ఞాపకం నిజంగా మధురమే
ప్రతి కథలో ఎదో కనిపించని ప్రాణం ఉంటుంది. జీవితంలో వేసే ప్రతి అడుగు వెనుక ఎన్నో ఆలోచనలు మనిషి తలరాతను మార్చేస్తాయి అనడంలో తప్పు లేదేమో అనిపిస్తుంది. ఎంత సంపాదించినా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒకానొక సమయంలో మనం అంతమైయితే ఏది రాదనే సత్యం తెలిసినా కూడా.. ఇంకా రాని వాటి గురించే ఆలోచిస్తాం. ఇక మనం చిన్న స్థాయిలో ఉన్నప్పుడు మన బాధలు కష్టాలను పంచుకున్న వారిని మర్చిపోవడానికి మనసు ఒప్పుకోదు. ప్రాణం ఉంది కాబట్టి మనిషితో మాటల ద్వారా ఆ అనుభవాలను పంచుకోవచ్చు. ఇక వారు వెళ్ళిపోతే జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి.
మన బాధలను కష్టాలు ఆనందాలు మనలో మనమే అనుభవించిన అనుభవాలు గుర్తుకురాకపోవచ్చు గాని ఆ అనుభవాలను అనుభవించిన ప్రదేశాలకు వెళితే కచ్చితంగా గుర్తు చేసుకోవచ్చు. ఎవరు ఉన్నా లేకపోయినా ఆఖరికి మనం ఉన్నా లేకపోయినా మనం గడిపిన ఆ క్షణాలు ఓ చోట ఉంటాయి. వాటిని మిస్ చేసుకుంటే జీవితంలో తృప్తి ఉండదు అనే విషయం అందరికి తెలియదు. కొంత మందికి మాత్రమే కొన్ని ప్రదేశాలు స్వీట్ మెమొరీస్ గా ఉంటాయి. అదే తరహాలో భీమవరం అకేల్లా నాగ శ్రీనివాస శర్మ ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా తన మధుర జ్ఞాపకాలను మర్చిపోలేదు.
1990 లలో సినిమా అవకాశాల కోసం వేటాడుతున్న సమయంలో హైదరాబాద్ పంజాగుట్ట లో రూమ్ తీసుకొని అక్కడే తన పెన్నుకు పదును పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గా మారాడు. కాలేజ్ ఫ్రెండ్ సునీల్ అలాగే దర్శకుడు దశరథ్ తో కలిసి తొలి కథల గురించి వివరించేవాడు. అక్కడే ఆకలిని చూశాడు. బాధని - కష్టాన్ని తొలి కథని ఇలా జీవితంలో మనిషికి ఎదురవ్వాల్సిన అనుభవాలన్నిటిని అక్కడే తెలుసుకొని కొద్దీ కాలానికే మంచి రచయిత అయ్యాడు. స్వయంవరం - సముద్రం - నిన్నే ప్రేమిస్తా - నువ్వే కావాలి - చిరునవ్వుతో వంటి సినిమాలకు రచయితగా వర్క్ చేశాడు. ఇక నువ్వు నాకు నచ్చావ్ లాంటి మంచి కామెడీ కథ కూడా అక్కడే పుట్టింది. అనంతరం మొదట దర్శకుడిగా వర్క్ చేసిన నువ్వే నువ్వే కథకు బీజం కూడా ఆ పంజాగుట్ట రూమ్ లోనే పడింది.
ఆ తరువాత అక్కడి నుంచి బయటకి వచ్చి ఎన్నో సినిమాలను చేశారు. అయితే ఆ రూమ్ ని మాత్రం త్రివిక్రమ్ అస్సలు వదులుకోలేదట. ప్రస్తుతం 5 వేల రూపాయలు రెంట్ కడుతూ ఇంకా అదే గదిని జ్ఞాపకంగా ఉంచుకున్నాడట. అప్పుడపుడు అక్కడికి వెళ్లి వస్తాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. నిజంగా జ్ఞాపకం ఎంత మధురమైనదో త్రివిక్రమ్ స్టోరీని చుదువుతూంటే అర్ధమవుతోంది కదా!